Friday, December 20, 2024

డికాక్ భారీ శతకం.. బంగ్లాపై సౌతాఫ్రికా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆలౌటైంది. మహ్మదుల్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 111 పరుగులు సాధించాడు. మిగతావారు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను డికాక్, క్లాసెన్‌లు మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ 140 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు, 15 బౌండరీలతో 174 పరుగులు చేశాడు. ఇక మార్‌క్రమ్ ఏడు ఫోర్లతో 60 పరుగులు సాధించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్ 49 బంతుల్లోనే 8 సిక్సర్లు, రెండు పోర్లతో 90 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తృటిలో శతకం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మిల్లర్ 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 15 బంతుల్లోనే అజేయంగా 34 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 382 పరుగుల రికార్డు స్కోరును సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News