Sunday, January 19, 2025

రోహిత్ ఔట్.. 9 ఓవర్లలో భారత్ 75/1

- Advertisement -
- Advertisement -

ముంబై వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. భారీ షాట్ కు యత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు శుభారంభం అందించారు. గిల్ నెమ్మదిగా ఆడినా.. రోహిత్ భారీ షాట్ లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దూకుడుగా ఆడిన రోహిత్.. 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 47 పరుగులు చేసి అర్థశతకం చేజార్చుకున్నాడు. ప్రస్తుతం భారత్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 75పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(4), గిల్(21)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News