Sunday, January 19, 2025

World Cup 2023: లంకతో నెదర్లాండ్స్ ఢీ..

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు నెదర్లాండ్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది.దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

లంకతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నెదర్లాండ్స్ బలంగా కనిపిస్తోంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. సౌతాఫ్రికాను ఓడించడంతో నెదర్లాండ్స్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇక లంక ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని తహతహలాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News