Wednesday, January 22, 2025

World Cup 2023: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్..

- Advertisement -
- Advertisement -

పుణే: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్ కు 93 పరుగుల భాగస్వామం నెలకొల్పారు. దీంతో బంగ్లా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.

ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని కుల్దీప్ యాదవ్ విడిదీశాడు. అప్పటికే అర్థశతకం పూర్తి చేసి జోష్ లో ఉన్న తంజిడ్ హసన్(51, 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం బంగ్లా జట్టు 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో లిట్టన్ దాస్(40), నజ్రుల్ హుస్సేన్ శాంటో(2)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News