Thursday, November 14, 2024

ఉప్పల్‌లో వరల్డ్‌కప్ ట్రోఫీ సందడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ట్రోఫీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తోంది. ప్రపంచకప్ ట్రోఫీని జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. గురువారం చారిత్రక చార్మినార్ ప్రాంతంలో ట్రోఫీని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అక్కడి నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి తరలించారు. ఉప్పల్‌లో ట్రోఫీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక ట్రోఫీ విశేషాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు వివరించారు. బుధవారం ప్రముఖ పర్యాటక కేంద్రం రామోజీ ఫిలీం సిటీలో వరల్డ్‌కప్ ట్రోఫీని అభిమానుల కోసం ఉంచిన విషయం తెలిసిందే. కాగా, ఉప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో హెచ్‌సిఎ అధికారులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా అక్టోబర్ ఐదు నుంచి వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కూడా కొన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News