Friday, December 20, 2024

రోహిత్ శర్మ సెంచరీ మిస్.. కష్టాల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్‌లో టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. అదిల్ రహీద్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ(87) లివింగ్ స్టన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 164 పరుగుల వద్ద భారత్ 5 వికెట్ కోల్పోయింది.

అంతకుముందు, విరాట్ కోహ్లీ(0), శ్రేయస్ అయ్యర్(04), శుభ్‌మన్ గిల్(9)లతో పాటు కెఎల్ రాహుల్(39)లు విఫలమయ్యారు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 39 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్(28), రవీంద్ర జడేజా(05)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News