Friday, December 20, 2024

గాయాల బారిన లంక.. జోష్ లో ఆఫ్గాన్.. గెలిచేది ఎవరు?

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా సోమవారం పుణె వేదికగా ఆఫ్ఘానిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లో ఇరుజట్టు రెండు మ్యాచ్ లు మాత్రమే గెలుపొందాయి. ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరాలంటే.. రెండు జట్టు మిగిలి నాలుగు మ్యాచ్ లోనూ విజయం సాధించడంతోపాటు మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సిందే.

ఇలాంటి సమయంలో శ్రీలంక ఆటగాళ్లు గాయాల బారిన పడి టోర్నీకి దూరమవుతుండడం.. ఆ జట్టును కలవరపెడుతోంది. మరోవైపు, ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్.. అదే జోష్ ను కొనసాగించాలని భావిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న లంక-ఆఫ్ఘాన్ మ్యాచ్ రసవత్తరంగానే ఉండనుంది.

 జట్ల వివరాలు:

ఆఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్, ఫజల్హాక్, అబ్దుల్ హజూకీ, రెహమాన్, నజీబుల్లా జద్రాన్.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుసల్ మెండిస్(కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, దిముత్ కరుణరత్నే, చమీక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News