Monday, December 23, 2024

ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు..

- Advertisement -
- Advertisement -

హాజరుకానున్న ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్

అహ్మదాబాద్: భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు అతిరథ మహారథులు హాజరుకానున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మం త్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా,ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాం త్ దాస్, అమెరికా రాయబారి ఎరిక్ గస్సెట్టి, అస్సాం సిఎం హేమంత్ బిస్వా శర్మ, భారత్‌లోని ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్, రిలియన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు, బా లీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు తదితరు లు ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తి లకించనున్నారు.

ఇ క ఫైనల్ మ్యాచ్‌కు వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్ల కెప్టెన్లను కూ డా ఆహ్వానించారు. కపిల్ దేవ్, ధోనీ, క్లైవ్ లాయిడ్, అలెన్ బోర్డర్, స్టీ వ్‌వా, క్లార్క్, ఇయాన్ మోర్గాన్, పాంటింగ్‌లు హాజరుకానున్నారు. అయితే జై లులో ఉన్న కారణంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫైనల్‌కు రాలేక పోతున్నారు. కెప్టెన్ల కోసం బిసిసిఐ ప్రత్యేకమైన బ్లేజర్‌ను బిసిసిఐ తయారు చేయించింది. మాజీ కెప్టెన్లు ఈ బ్లేబర్‌ను ధరించి ఫైనల్‌ను వీక్షిస్తారు.

అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఫైనల్ మ్యాచ్‌కు వాయుసేన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పది నిమిషాల పాటు వైమానిక దళం వి న్యాసాలు చేయనుంది. 9 ఎయిర్ క్రాఫ్ట్‌ల బృందం గల సూర్యకిరణ్ ఏక్రోబాటిక్ టీమ్ ఈ వేడుకల్లో కనువిందు చేయనుంది. అంతేగాక ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

ప్రీతమ్, జోనితా గాంధీ, అమిత్ మిశ్రా, నకాష్ అజీజ్, తుషార్ జోషి వంటి స్టార్ సింగర్లు అలరించనున్నారు. 500 మందికి పైగా డ్యాన్సర్లు తమ నృతంతో కనువిందు చేయనున్నారు. దీంతో పాటు 90 సెకన్ల పాటు జరిగే లైట్‌షో, లేజర్‌షో ఫైనల్‌కు హైలైట్‌గా నిలువనుంది. అంతేగాక డ్రింక్స్ బ్రేక్, మొదటి ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో పలువురు సెలబ్రెటీలు తమ ప్రదర్శనతో అభిమానులను ఉర్రుతాలుగించనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారీ స్థాయిలో బాణాసంచా, టపాసులు కాల్చనున్నారు. మరోవైపు మ్యాచ్‌ను పురస్కరించుకుని స్టేడియం పరిసరాల్లో కనువిని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 60వేల మంది భద్రత సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.

దేశంలో క్రికెట్ సందడి..

ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో దేశంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణమే కనిపిస్తోంది. దేశంలోని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని నగరాలు కూడా క్రికెట్ సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. భారత జట్టు ట్రోఫీని గెలువాలని కోరుకుంటూ పలు నగరాల్లో అభిమానులు ప్రత్యేక ప్రార్థనాలు నిర్వహిస్తున్నారు. మెగా సిటీల్లోని ప్రధాన కూడాళ్లలో మ్యాచ్‌ను చూసేందుకు భారీ టివి స్క్రీన్లలో ఏర్పాటు చేశారు. మొత్తం దేశంలోని ఏ ప్రాంతంలో చూసిన క్రికెట్‌కు సంబంధించి ముచ్చటే కనిపిస్తోంది. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా ట్రోఫీని ముద్దాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News