Sunday, January 19, 2025

గెలిచిన జట్టుపై కనకవర్షం!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఏ జట్టు గెలుస్తుందనే విషయమై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఇక ప్రైజ్ మనీ వివరాల కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఆదివారం ఫైనల్లో గెలిచిన జట్టుకు అక్షరాలా నాలుగు మిలియన్ డాలర్లు లభిస్తాయి. అంటే భారతీయ కరెన్సీలో 33 కోట్ల 31 లక్షల రూపాయలన్నమాట. రన్నరప్ గా నిలిచిన జట్టుకు అందులో సగం, రెండు మిలియన్ డాలర్లు దక్కుతాయి. అంటే 16 కోట్ల రూపాయల పైమాటే. సెమీఫైనల్ కు చేరి ఇంటిదారి పట్టిన న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు కూడా ప్రైజ్ మనీ తక్కువేం దక్కట్లేదు. ఈ రెండు జట్లకూ చెరో ఎనిమిది లక్షల డాలర్లు (అంటే సుమారు ఆరు కోట్ల 60 లక్షల రూపాయలు) అందుతాయి. సూపర్ సిక్స్ దశలో వెనుదిరిగిన జట్లకు తలా 83 లక్షల రూపాయలు, లీగ్ దశలో ప్రతి మ్యాచ్ లో గెలిచిన జట్టుకు 33 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ అందనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News