ప్రపంచ ధరిత్రి దినోత్సవం పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి ఏప్రిల్ 22న జరిగే ప్రపంచ వార్షిక కార్యక్రమం. ఇది మొదటిసారి ఏప్రిల్ 22, 1970న నిర్వహించబడింది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎర్త్‌డే.ఆర్గ్ (earthday.org) ద్వారా 193 కంటే ఎక్కువ దేశాల్లోని 1 బిలియన్ మంది వ్యక్తులతో సహా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1969లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన యునెస్కో (UNESCO) సమావేశంలో, శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ భూమిని, శాంతిభావనను గౌరవించే రోజును ప్రతిపాదించాడు. దీనిని మొదట మార్చి 21, 1970న, ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం మొదటి రోజున పాటించాలని ప్రతిపాదించారు.
ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ యు థాంట్ సంతకం చేసారు. ఒక నెల తర్వాత, యునైటెడ్ స్టేట్స్ సెనెటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణ బోధనను నిర్వహించాలనే ఆలోచనను ప్రతిపాదించారు. నెల్సన్, హేస్ ఈ కార్యక్రమానికి ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే) అని పేరు పెట్టారు. 2025 ప్రపంచ భూమి దినోత్సవం అధికారిక సారాంశం ‘మనశక్తి, మనగ్రహం’. ఇది పునరుత్పాదకశక్తికి మారడం, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం అనే సమష్టి బాధ్యతపై దృష్టి పెడుతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక శక్తి మొత్తాన్ని మూడురెట్లు పెంచడం, ముఖ్యంగా సౌర, పవన భూఉష్ణ వంటి శుభ్రమైన వనరులను నొక్కి చెప్పడం ముఖ్య లక్ష్యం. జీవుల మనుగడకు అనుకూలమైన గ్రహం భూమి. కానీ అది చాలా సమస్యలను ఎదుర్కొంటోంది.
వాతావరణ మార్పుల కారణంగా నాసా ప్రకారం, భూమిపై గ్లోబల్ వార్మింగ్ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 59 డిగ్రీల ఫారెన్‌హీట్ (15 డిగ్రీల సెల్సియస్) వద్ద ఉంది. గాలి, నీరు, నేల, ధ్వని కాలుష్యాలు పెరుగుతున్నాయి. 1970 నుండి జీవవైవిధ్య నష్టం 73%గా ఉంది. సంవత్సరానికి 10 మిలియన్ హెక్టార్లలో అటవీ నిర్మూలన జరుగుతోంది. పెరుగుతున్న మానవ జనాభా, పెరుగుతున్న వినియోగం సహజ వనరులపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది నీటి కొరత, ఆహార అభద్రత, ఆవాసాల నాశనానికి దారితీస్తుంది. మరోవైపు, ప్లాస్టిక్‌ల ఉత్పత్తి, పారవేయడం మహాసముద్రాలు, పల్లపు ప్రాంతాలు, పర్యావరణ వ్యవస్థలలో కాలుష్యానికి, వన్యప్రాణులకు, ఆహార గొలుసులకు అంతరాయం కలిగిస్తుంది. 1970ల చివరి నుండి, ఓజోన్ స్థాయిలు సగటున 4% తగ్గాయి.
ప్రపంచవ్యాప్తంగా, జనాభాలో గణనీయమైన భాగం నీటి కొరతను అనుభవిస్తోంది. దాదాపు 25% మంది నీటిఒత్తిడి, కొరతను ఎదుర్కొంటున్నారు. 2025 నాటికి, ప్రపంచ జనాభాలో మ%8