Sunday, December 22, 2024

వయోవృద్దులకు ట్రస్మా ఆసరా

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః జిల్లాలోని వయోవృద్దుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తెలంగాణ ఆలిండియా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్ల శాఖ ఆసరాగా ఉంటుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నేతజీ వృత్తి విద్య కలేజి సమవేశ మందిరంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్దులపై వేధింపులు నివరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్‌కు సేవలందిస్తున్న 22 మందిని శాలువాలు, మెమోంటోలతో హరి అశోక్ కుమార్ సన్మానించారు. సాయంత్రం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు.

ఈ సదస్సులో హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో డే కేర్ సెంటర్ ఏర్పాటుకు, వృధ్దాశ్రమ భవన నిర్మాణం పూర్తి కోసం గతంలో ఇచ్చిన రూ.50 లక్షలతో పాటు అదనంగా మరో రూ.50 లక్షల నిధుల మంజూరుకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ డైరెక్టను ఆదేశించడం పట్ల తమ అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. మెట్‌పల్లి, కోరుట్ల డివిజన్‌లలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వయోధికుల కేసుల పరిష్కారంలో ఆర్‌డిఓలు మాధురి, వినోద్‌కుమార్‌లు మొదటి స్థానంలో నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, గౌరవ సలహాదారు జిఆర్ దేశాయ్, ఉపాధ్యక్షుడు పిసి హన్మంత్‌రెడ్డి, ఎండి యాకుబ్, కోశాధికారి వి.ప్రకాష్‌రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కె.సత్యనారాయణ,

పి.అశోక్‌రావు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్‌ల నాయకులు ఎండి ఎక్బాల్, సయ్యద్, యాకుబ్, రాజేశ్వరి, నారాయణ, పబ్బ శివానందం, ఒజ్జెల బుచ్చిరెడ్డి, సౌదాల కమలాకర్, రాజ్‌మోహన్, టిబిసి జెఎసి జిల్లా యువత అధ్యక్షుడు కుసరి అనిల్‌కుమార్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News