Friday, December 27, 2024

డబ్బులున్నా కొనేందుకు సరుకులేని దుస్థితి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచి అమెరికా వరకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం విపరీత పరిణామాలకు దారితీస్తోంది. ప్రత్యేకించి పంట పొలాలు, పండ్ల ఉత్పత్తి దెబ్బతింటోంది. పంటల దిగుబడి ఎక్కువగా ఉండే దేశాలలో ఈ పరిణామంతో ఆహార సరఫరాలకు పెద్ద ఎత్తున విఘాతం ఏర్పడుతోంది. ధరలు పెరుగుతున్నాయి. ఈవారం ఇండియా బియ్యం ఎగుమతులపై ఉన్నట్లుండి నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం వాడకంలో సగం ఇండియాపైనే ఆధారపడుతారు. దేశంలో బియ్యం ధరలకు నియంత్రణ దిశలో బియ్యం పంపించడాన్ని నిలిపివేశారు.

ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం కూడా సరఫరాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు బ్లాక్‌సీ నుంచి సురక్షితంగా వెళ్లేందుకు కుదిరిన ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. దీనితో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు నిలిచిపొయ్యాయి. ఈ దశలోనే ఇటీవలే సంభవించిన ఎల్‌నినోతో వ్యవసాయానికి చిక్కులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గడంతో ఇకపై పలు చోట్ల సూపర్‌మార్కెట్లలోకి నిల్వలు చేరడం తగ్గుతుంది. దీనితో చేతి లో డబ్బున్నా కొనుక్కునేందుకు సరుకులు లేక వినియోగదారులు విలవిలలాడే పరిస్థితి ఏర్పడనుందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పుడు మనమంతా ద్రవ్యోల్బణ క్లిష్టతతో కొట్టుమిట్టాడాల్సి వస్తోందని లండన్‌లోని ఛాతమ్ హౌస్ ఆహార భద్రత నిపుణులు టిమ్ బెంటెన్ తెలిపా రు. ఓ వైపు క్రమేపీ ద్రవ్యోల్బణం తోకముడుస్తోందని ఆనందిస్తున్నా, ధరలు తగ్గుతాయనే నమ్మకం లేదని చెప్పారు. ధరలు క్రమేపీ మరింతగా పెరుగుతాయన్నారు.

ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో ఇప్పుడు వీస్తోన్న వేడిగాలులలో ఇది ఆయా ప్రాంతాల్లోని రైతులకు కష్టకాలం అయింది. దీని ప్రభావం క్రమేపీ పలు ప్రాంతాల్లోని వినియోగదారులపై పడుతుందని ఆందోళన వ్యక్తం అయింది. దీర్ఘకాలిక కరువుకాటకాలు, భారీ వర్షాలు, వరదలతో వ్యవసాయరంగం చతికిలపడుతోంది. దీనితో ఇక ఈ ఏడా ది చివరి భాగం అంతా సరుకుల కటకటలతో ముగుస్తుందని ఆందోళన వ్యక్తం అయింది. ఇక పంటలతో పాటు పాడికి కూడా కటకట ఏర్పడుతోంది. దక్షిణ యూరప్‌లో పాల ఉత్పత్తి తగ్గింది. టమాటలకు తెగుళ్లు ఏర్పడ్డాయి. పండ్ల ఉత్పత్తి తగ్గింది. దీనితో భారీ మార్కెట్లతో ఉండే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో సరుకులకు ఇబ్బంది ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News