Thursday, January 23, 2025

ఆకాశమంత ఎత్తులో అందాల వీక్షణాలు..

- Advertisement -
- Advertisement -

జమ్మూ : ప్రపంచ అత్యంత ఎతైన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ రైలు బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై చుట్టూ లోయలు , పర్వతాల నడుమ ఈ వృత్తాకారపు ఉక్కు బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సందర్శకుల మరింత రాకకు సరైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తుతో , నదీ మట్టం నుంచి 359 మీటర్లపైన ఈ 1.3 కిలోమీటర్ల రైలు బ్రిడ్జి ఏర్పాటు అయింది. కత్రా నుంచి బనిహిల్‌కు 111 కిలోమీటర్ల అనుసంధాన మార్గంగా ఉంది. ఇప్పుడు సాగుతోన్న యుఎస్‌బిఆర్‌ఎల్ ప్రాజెక్టులో భాగంగా ఈ రైలు బ్రిడ్జి రూపకల్పన జరిగింది.

జమ్మూ కశ్మీర్ చీఫ్ సెక్రెటరీ ఎకె మెహతా , రియాసీ డిప్యూటీ కమిషనర్ బబిలా రాక్వాల్ ఇతర అధికారులతో కలిసి శనివారం ఇక్కడ పర్యటించారు. బ్రిడ్జిని మెహతా నిపుణులైన ఇంజనీర్లు, పలువురు సాంకేతిక సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో విశిష్ట నిర్మాణ ప్రక్రియ, ఇంజనీరింగ్ అద్భుతాలతో ఈ వంతెన రూపుదిద్దుకుందని చీఫ్ సెక్రెటరీకి తెలిపారు. ఈ రైల్వే బ్రిడ్జితో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం అవుతుందని, క్రమేపీ పర్యాటకుల సంఖ్య పెరిగే దశలో ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉందని అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News