Tuesday, November 5, 2024

ప్రపంచం సున్నిత పరిస్థితులను ఎదుర్కొంటోంది

- Advertisement -
- Advertisement -
world is facing a delicate situation: PM Modi
ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ వ్యాఖ్య

మీర్జాపూర్(యుపి): యావత్ ప్రపంచం ప్రస్తుతం సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని, సంక్షోభం ఎంత తీవ్రమైనదైనా భారత్ అందుకు దీటుగా స్పందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఆపరేషన్ గంగ కింద ఉక్రెయిన్ నుంచి వేలాదిమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చామని, అక్కడ చిక్కుకుపోయిన ఇతర భారతీయులను కూడా తరలిస్తున్నామని చెప్పారు. ఈ శతాబ్దంలో ప్రపంచమంతా అత్యంత సున్నితమైన పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు. అనేక దేశాలు కరోనా మహమ్మారితో, అస్థిరతతో, అశాంతితో అల్లడుతున్నాయని మోడీ చెప్పారు.

సంక్షోభం ఎంత తీవ్రమైనదైనా దాన్ని ఎదుర్కొనడానికి భారత్ చేసే ప్రయత్నాలు పటిష్టంగా ఉంటాయని ఆయన అన్నారు. గంగామాతతో ముడిపడిన ఏ కార్యక్రమమైనా విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో విదేశాలలో చిక్కుకుని పోయిన ప్రతి పౌరుడిని ఆపరేషన్ వందే భారత్ ద్వారా తీసుకువచ్చామని, అఫ్ఘానిస్తాన్‌లో ఆపరేషన్ దేవీ శక్తి చేపట్టామని, ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను, పౌరులను భారత్‌కు తరలిస్తున్నామని మోడీ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్లు వారసత్వవాదులను, మాఫియావాదులను ఓడించి బిజెపిని తిరిగి గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News