Tuesday, November 5, 2024

కిడ్నీ వ్యాధి భారిన పడకుండ జాగ్రతలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

World Kidney Day 2022

హైదరాబాద్: కిడ్నీ వ్యాధి భారిన పడకుండ ముందే జాగ్రత్తలు తీసుకోవాలని వాసవి ఆసుపత్రి ఛైర్మన్ జి. చంద్రయ్య సూచించారు. కిడ్ని దినోత్సవం సందర్భంగా గురువారం వాసవి ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ జబ్బు రాక ముందే జాగ్రత్త పడాలని, ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారు తరుచుగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాసవి ఆసుపత్రిలో ప్రతిరోజు అనేక మందికి డయాలసీస్ చేస్తున్నామని తెలిపారు. ఇది పేదల ఆసుపత్రి అని, ప్రతి పేదవాడికి అవసరమైన వైద్య పరీక్షలు నామమాత్రపు రుసుంతో చేస్తున్నామని వెల్లడించారు. వారం రోజుల పాటు కిడ్నీ వ్యాధిపై అవగాహణ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ఆసుపత్రి కిడ్నీ వ్యాధి వైద్యంతో పాటు దయాలసిస్‌లో నెంబర్ వన్ అని, డబ్బు ప్రధాన కాదని, అది ఈ రోజు ఉండోచ్చు రేపు ఉండకపోవచ్చాని, కానీ సేవ చేసే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ సందర్బంగా వైద్య సిబ్బందికి సూచించారు.

రాబోయే కాలంలో మరిన్ని ఉచితసేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చంద్రయ్య వెల్లడించారు. వాసవి ఆసుపత్రి నెఫ్రాలజీ హెడ్ ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్ డాక్టర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ కిడ్ని అనేది వాషింగ్ మిషన్ లాంటిదని, ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు ప్రతి రోజు రెండు నుంచి రెండున్నర లీటర్ల మంచినీరు తీసుకోవాలని సూచించారు. కిడ్ని వ్యాధి భారిన పడకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రతలను వివరిస్తూ గ్లూకోజ్ స్థాయిని మోతాదులో ఉంచుకోవాలని, కాళ్ల వాపులు, నీరసం అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సదస్సులో డాక్టర్ శివశంకర్‌రెడ్డి, జి.వి.రమణ, హతమ్ ఫాహిన్, పద్మ కిరణ్, శ్రవణ్ కుమార్, వాసవి ఆసుపత్రి వైద్యులు, స్టాప్, కిడ్ని వ్యాధి బాధితులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News