Thursday, December 26, 2024

భారత్‌కు ప్రపంచ నేతల శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్:భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్‌అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మార్కోస్, ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్, అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు దేశాల నేతలనుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలకు సందేశాలు అందాయి. భారత్‌తో బంధాన్ని మరితం బలోపేతం చేసుకుంటామని ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలు, మంత్రులు పేర్కొన్నారు.77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారంతా శుభాకాంక్షలు తెలియజేశారు.

కొన్ని సందేశాలకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఇటీవల బాస్టిల్ డే సందర్భంగా ప్రధాని మోడీ పాల్గొన్న కొన్ని కీలక కార్యక్రమాల వీడియోను కూడాషేర్ చేశారు. అభినందనలు తెలియజేసిన వారిలో నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్,శ్రీలంక విదేశాంగమంత్రి అలీ సబ్రీ తదితరులు కూడా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News