Sunday, January 19, 2025

90 రోజుల్లో ప్రపంచంలో లక్షలాది మంది చనిపోతారు!

- Advertisement -
- Advertisement -
హెచ్చరించిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్
భూగోళంపై 10 శాతం జనాభాకు కోవిడ్ సంక్రమణ!

బీజింగ్: చైనాలో కొవిడ్-19 ఆంక్షలు తొలగించాక, అక్కడ పెద్ద ఎత్తున కరోనావైరస్ కేసులు పెరిగిపోయాయి. చైనాలోని ఆసుపత్రులన్నీ నిండిపోయాయని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్, హెల్త్ ఎకనామిస్ట్ ఎరిక్ ఫీగల్‌డింగ్ తెలిపారు. రాగల 90 రోజుల్లో చైనాలో 60 శాతం మంది, ప్రపంచంలో 10 శాతం మంది కరోనా సంక్రమానికి గురవుతారని, లక్షలాది మంది చనిపోతారని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం చైనాలో కొవిడ్-19 వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది. చైనా రాజధాని బీజింగ్ స్మశాన వాటికల్లో శవాలు వరుస కడుతున్నాయి. చైనా ఆంక్షలు ఎత్తివేయడం వల్ల వ్యాధి సంక్రమణలు పెరిగిపోయాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఎరిక్ ఫీగల్‌డింగ్ ప్రకారం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సిసిపి) లక్ష్యం ఏమిటంటే, “ ఎవరికి వ్యాధి సంక్రమణ జరగాలో జరగని, ఎవరు చనిపోవాలని రాసిపెట్టి ఉంటే చనిపోని,ముందస్తుగా సాంక్రమించడం, చనిపోవడం, అత్యున్నత స్థాయికి చేరుకోవడం, ఉత్పత్తి ముందస్తుగాను తిరిగి మొదలవ్వడం జరగనీ”.

బీజింగ్‌లోని డోంగ్‌జియో స్మశాన వాటికలో అంత్యక్రియలు పెరిగిపోయాయి. “మళ్లీ కొవిడ్ కేసులు పెరిగిపోవడంతో మాపై పని భారం పెరిగిపోయింది. ప్రస్తుతానికి రోజుకు 24 గంటలూ పనిచేయాల్సి వస్తోంది” అని స్మశాన వాటికలోని ఓ మహిళా ఫోన్ ద్వారా తెలిపింది. అర్ధరాత్రి, తెల్లవారు అన్న తేడాలేకుండా శవాలు స్మశాన వాటికకు చేరుకుంటున్నాయని ఆమె చెప్పింది. ప్రతి రోజు స్మశాన వాటికకు 200 శవాలు వస్తున్నాయని పేర్కొంది. స్మశాన వాటికలో పనిచేసే వారి పనిభారం ఇబ్బడిముబ్బడైంది. చైనాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో ప్రజలు ‘ఇబుప్రోఫెన్’ కొనడానికి ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీకి పరుగులు తీస్తున్నారు.

చైనా మూడు సంవత్సరాలుగా ‘జీరోకొవిడ్’ పద్ధతిని పాటించడంతో ప్రజలు విసిగిపోయి వీధుల్లోకి వచ్చి నిరసనలు, సమ్మె చేశారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి ఆంక్షలు, లాక్‌డౌన్ ఎత్తివేసింది. ఇప్పుడు అక్కడ కరోనా వ్యాధి లక్షణాలు, సంక్రమణం తీవ్రం అయ్యాయి. ఇదివరలో అంబులెన్స్ కోసం రోజుకు 5000 మంది ఫోన్‌లు చేసేవారు, కానీ అది ఇప్పుడు 30000కు పెరిగిపోయింది. చైనాలో 1.4 బిలియన్ ప్రజలు వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అక్కడ వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడం, ఎమర్జెన్సీ కేర్ విషయంలో తక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల సమస్య అనతి కాలంలోనే తీవ్రం అయ్యేలా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News