Thursday, January 23, 2025

ప్రపంచకప్ బాక్సింగ్ క్వార్టర్స్‌లో దీపక్, నిశాంత్

- Advertisement -
- Advertisement -

తాష్కెంట్ : ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు దీపక్ భోరియా, నిశాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఉబ్జెకిస్థాన్‌లోని తాష్కెంట్ వేదికగా ఈ ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన 51 కిలోల విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ దీపక్ 50 తేడాతో చైనాకు చెందిన జిమావో జాంగ్‌ను ఓడించాడు. ఆ.రంభం నుంచే దీపక్ తనదైన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు.

అతని ధాటికి జాంగ్ కనీస పోటీ కూడా ఇవ్వకుండానే ఓటమి పాలయ్యాడు. మరోవైపు 71 కిలోల విభాగంలో నిశాంత్ దేవ్ విజయం సాధించాడు. పాలస్తినాకు చెందిన నిడాల్ ఫొఖాహాతో జరిగిన పోరులో నిషాంత్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన దీపక్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News