Friday, November 15, 2024

కదిలే కోవెల అమ్మ: మాచన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వంద దేవుల్లే,కలిసొచ్చినా, అమ్మా,నీ లా..గా చూడలేరమ్మా.!అంటూ..ఆమ్మ ప్రేమ శ్లాగించారు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.ఆదివారం నాడు వరల్డ్ మదర్స్ డే సందర్భంగా తన మాతృమూర్తి నీ కలసి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కోట్ల సంపదున్నా,అమ్మ ప్రేమ కింద దిగదుడుపేనన్నారు. కదిలే కోవెలే అమ్మా..అని స్తుతించారు.
ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమన్నారు.

త్యాగానికి ప్రతిరూపమే అమ్మ , అని అభివర్ణించారు. ఎంతో అనంతమైన ప్రేమ కురిపించే అమ్మ కోసం ,ఆమె అజరామరమైన అనురాగం కోసం పొగాకు, ధూమపానం అలవాట్లను మానేస్తాం అని ప్రతీణ పూనాల్సిందింగా.. “మాచన” యువత కు సూచించారు.కన్న తల్లి కి తన బిడ్డలు గొప్ప వాళ్ళుగా ఐతే కలిగే సంతోషం అనంతం అని స్పష్టం చేశారు.అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్ళు ఐతే, అది కన్న బిడ్డ లకు పంచే వాళ్లే అమ్మ, నాన్నలు అని పేర్కొన్నారు. చీరలు,నగ నట్ర కాదు అమ్మ కోరుకునేవి, అమ్మా అన్న ఒక్క ఆత్మీయ పిలుపే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News