- Advertisement -
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ సింగిల్ విజేత, ప్రపంచ నంబర్‌వన్ జన్నిక్ సినర్ (ఇటలీ)కి షాక్ తగిలింది. గతేడాది వచ్చిన డోపింగ్ ఆరోపణలకు ఇప్పుడు శిక్ష ఖరారైంది. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో సినర్ సింగిల్ ఛాంపియన్‌గా నిలిచాడు. కిందటి ఏడాది సినర్‌పై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో డోపింగ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. అయినా సినర్ నిషేధం నుంచి తప్పించుకున్నాడు. అయితే దీనిపై ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తిరిగి విచారణ చేపట్టింది. దీంతో యాంటీ డోపింగ్ ఏజెన్సీతో సినర్ ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. మూడు నెలల నిషేధాన్ని సినర్ అంగీకరించినట్టు సమాచారం. ఫిబ్రవరి 9 నుంచి సినర్‌పై నిషేధం అమల్లోకి వచ్చినట్టు టెన్నిస్ వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -