- Advertisement -
హైదరాబాద్: ఎన్నో అద్భుతాలను సృష్టించగల మేధస్సు ఉన్న మానవడు తన ఆర్యోగాన్ని క్షీణింపజేసే అవాంఛనీయమైన పొగాకు వ్యసనానికి గురికావడం అవసరమా అని ఎవరికీ వారు ప్రశ్నించుకోవాల్సి అవసరముందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ పిలుపు నిచ్చారు. బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలో ద్విచక్ర వాహనంపై ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ పొగాకు కాదది పగ ఆకు అని హెచ్చరించారు. దమ్ము రుచి మరిగారో ఇక మీ దమ్ము తీసేదాక వదలదంటూ హెచ్చరించారు. గత 5 ఏళ్లల్లో 5వేల కిలో మీటర్ల మేర 500 గ్రామాలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ 50 వేల మందికి పైగా పోగాకు అనర్థాలపై అవగాహన కల్పించి ధూమపానాన్ని మానేద్దామనే ప్రతీణ పూనేలా చేశానన్నారు.
- Advertisement -