Saturday, December 21, 2024

‘వరల్డ్ ఆఫ్ యుఫోరియా’ గ్లింప్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాలో విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. “యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

గుణశేఖర్ మాట్లాడుతూ.. “యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. కథను రాస్తున్న కొద్దీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్న యూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నీలిమ గుణ, విఘ్నేష్, శ్రీనిక రెడ్డి, పృథ్వీ రాజ్, లిఖిత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News