Sunday, December 22, 2024

వరల్డ్ ఆఫ్ వాసుదేవ్

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ’వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ ను రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. ‘క‘ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‘క’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News