Monday, December 23, 2024

కొత్త సంవత్సరం తొలిరోజుకు 7.9బిలియన్ ప్రపంచ జనాభా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: కొత్త సంవత్సరం 2023 మొదటిరోజుకు ప్రపంచ జనాభా 7.9బిలియన్‌కు చేరుకోనుంది. 2022జనవరి ఒకటో తేదీనాటికంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్య 73.7మిలియన్ అధికం కానుంది. కొత్త ఏడాది తొలిరోజుకి ప్రపంచ జనాభా 7.9బిలియన్‌గా నమోదవుతుందని అమెరికాకు చెందిన సెన్సస్ బ్యూరో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే జనాభా పెరిగినట్లు సెన్సస్ బ్యూరో పేర్కొంది.

2023జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3పుట్టుకలు, రెండు మరణాలు నమోదవుతాయని అంచనావేస్తున్నట్లు బ్యూరో తెలిపింది. న్యూ ఇయర్ తొలిరోజు న్యూయార్క్ ప్రజల సంఖ్య 334.2మిలియన్‌కు చేరుకుంటుందని గత ఏడాదితో పోలిస్తే 1.5మిలియన్ జనాభా అధికంగా నమోదవనున్నారు. అమెరికాలో ప్రతి సెకనుకు ఒక పుట్టుక నమోదయితే ప్రతి పది సెకన్లుకు ఒకరు తనువు చాలిస్తారని వేస్తున్నారు. అంతర్జాతీయ వలసల కారణంగా ప్రతి 32సెక న్లుకు ఒకరు అమెరికా దేశ జనాభాలో చేరతారని అంచనా. కాగా సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం పుట్టుక, మరణం, అంతర్జాతీయ వలసలను పరిగణనలోకి తీసుకుంటే అమెరికా జనాభాలో ప్రతి 27సెకన్లుకు ఒకరు పెరగ నున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News