Thursday, January 23, 2025

అంతా ఇలా చేస్తే…హరిత భారతమే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మనమందరం కలిసి పని చేస్తే, భూమిపై మనం సాధించలేనిదంటూ లేదనే నా ఆశయానికి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక ప్రతీరూపంగా కనిపించారన్నారు‘ ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్ మెంటల్ ప్రొగ్రాం మాజీ ఎగ్జిక్యూట్ డైరెక్టర్, నార్వే మాజీ మంత్రి, గ్రీన్ బెల్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ సంస్థ స్థాపకుడు ఎరిక్ సోల్హీమ్ శుక్రవారం బేగంపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎరిక్ సోల్హీమ్ మాట్లాడుతూ.. మనిషి సృష్టించిన కాలుష్యం, కర్భన ఉద్గారాలు, అడవులను నరకడం ఈ భూమిని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ద్వారా దశాబ్ధ కాలంలోనే 7% శాతం అడవులు పెరగడం అద్భుతమైన విషయం. ఇది సిఎం కెసిఆర్ విజనరీ లీడర్ షిప్‌కు నిదర్శనం.

ఇలాగే దేశంలో ప్రతీ రాష్ట్రం తెలంగాణ స్పూర్తిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి. తెలంగాణలో ప్రభుత్వం మాత్రమే కాదు, ఎంపి సంతోష్ కూడా తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా కోట్ల మందిని కదిలించారు. కోట్లాది మొక్కలు నాటించారు. ఆయన ప్రతీరోజు ప్రపంచంలో ఎక్కడో ఓ చోట నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతుంటరనే విషయాన్ని చాలామంది పర్యావరణ మిత్రులు తనతో చెప్పారన్నారు. పచ్చదనం పెంపులో వారిది అద్భుతమైన పాత్ర, అంతేకాదు, వారు ప్లాస్టిక్ నియంత్రణ కోసం కార్యక్రమాల్ని రూపొందించి అమలు చేయడం చాలా సంతోషించదగ్గ పరిణామం. మన పూర్వీకులెవరు ప్లాస్టిక్ వాడలేదు, కానీ మనం కావాలని తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ భూతం ఇవ్వాల నేలను, మానవాళిని తినేస్తుంది. ఇది ఆగిపోవాలంటే ప్రతీ ఒక్కరు జోగినిపల్లి సంతోష్ కుమార్ కావల్సిన అవసరం ఉంది. తాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముగ్గురు పర్యావరణవేత్తలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నాను. వారితో మొక్కలు నాటించి, ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విస్తరించేందుకు తన వంతు తోడ్పాటును అందిస్తానంటూ తెలిపిన ఆయన, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎంపి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రూపొందించిన వృక్షవేదం హరితహాసం వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ టేబుల్ బుక్స్‌ను ఎరిక్ సోల్హీమ్‌కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు ఎరిక్ సోల్హీమ్‌తో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషం కలిగించిందన్నారు. వారి స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొక్లైమ్ సిఇఒ కెవిన్ కందస్వామి, సిఒఒ శశిధర్ తో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబెర్స్ రాఘవ, కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Green India 2

Green India 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News