Monday, December 23, 2024

ప్రపంచ షూటింగ్‌లో భారత్‌కు కాంస్యం

- Advertisement -
- Advertisement -

బాకు (అజర్‌బైజాన్): ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. అజర్‌ బైజాన్‌లోని బాకు నగరంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. గురువారం ప్రారంభమైన ఛాంపియన్‌షిప్‌లో భారత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ టీమ్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. సరబ్‌జ్యోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమాలతో కూడిన భారత బృందం మొత్తం 1,734 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

ఈ విభాగంలో చైనా టీమ్‌కు స్వర్ణం, జర్మనీ బృందం రజతం దక్కించుకుంది. రానున్న పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పోటీలుగా పరిగణిస్తున్న ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News