- Advertisement -
హైదరాబాద్: ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్బంగా మిర్చి, సెంచరీ మెట్రెస్ సహకారంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేకమైన ప్రచారాన్ని రూపొందించారు. ప్రయోజకరమైన నిద్రచిట్కాలు, నిద్ర పోయే ముందు జరిగే సరద సంభాషణలు, నిద్రవేళ కథలతో రేడియో ప్రసారం ద్వారా ప్రజలను చేరుకోగలిగారని ఈకార్యక్రమం నిర్వహకులు డా. వి.వి.రమణ ప్రసాద్ పేర్కొన్నారు. ఈప్రచారం నిద్రకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి, నిద్రకు ప్రాదాన్యతనివ్వడానికి ప్రజలను ప్రొత్సాహించడానికి, సహాయపడే కారకాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. శ్రోతలకు మంచి నిద్ర వలన కలిగే ఉపయోగాలు, నిద్రలేమితో తలెత్తే ప్రమాదాలు,నిద్ర సమస్యలని అధిగమించడానికి కావాల్సిన చిట్కాలు తెలిపారు.
World Sleep Day 2021 Awareness
- Advertisement -