Sunday, December 22, 2024

సింగపూర్‌లో స్పైబాస్ భేటీ

- Advertisement -
- Advertisement -

సింగపూర్ : ప్రపంచ దేశాల గూఢచార సంస్థల అధినేతల సదస్సు సింగపూర్‌లో రహస్యంగా జరిగింది. దాదాపు 24 దేశాల స్పై సంస్థల చీఫ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్నారని వెల్లడైంది. ఈ వారాంతంలోనే సింగపూర్‌లో జరిగే షాంఘ్రీ లా సంప్రదింపుల నేపథ్యంలో ఈ సంస్థల అధినేతల భేటీ జరిగింది. సింగపూర్ ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.

అమెరికా తరఫున జాతీయ ఇంటలిజెన్స్ సంస్థ (ఎన్‌ఐఎ) డైరెక్టర్ అవ్రిల్ హైనిస్ హాజరయ్యారు. చైనా కూడా తమ ప్రతినిధిని ఈ భేటీకి పంపించింది. భారతదేశపు ఓవర్సీస్ ఇంటలిజెన్స్ సంస్థ డైరెక్టర్ సామంత్ గోయల్ కూడా వచ్చినట్లు భారతీయ వర్గాలు తెలిపాయి. రష్యా తరఫున ప్రాతినిధ్యం లేదని వెల్లడైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, అంతర్జాతీయ ప్రభావిత నేర విషయాలు, ప్రత్యేకించి సైబర్ దాడులు వంటివి ప్రస్తావనకు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News