Wednesday, January 22, 2025

ఏటా దేశంలో తలసీమియాతో 10,000 మంది జననం

- Advertisement -
- Advertisement -

రేపు ప్రపంచ తలసీమియా దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో తలసీమియా వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏటా మే 8 న ప్రపంచ తలసీమియా దినోత్సవాన్ని నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. తలసీమియా అనేది ఎర్రరక్త కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత. ఇది తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు సంక్రమిస్తుంది. దీనిలో శరీరం అసాధారణమైన హీమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఎర్రరక్త కణాలకు అధికంగా హాని జరుగుతుంది. ఫలితంగా రక్తహీనతకు దారి తీస్తుంది. హీమోగ్లోబిన్ ఉత్పత్తికి సంబంధించిన జన్యువుల్లో అసహజమైన, అసాధారణమైన జన్యు లోపం తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమిస్తుంది. తలసీమియా లో రెండు రకాలు ఉన్నాయి. తలసీమియా మేజర్, మైనర్ అని రెండు రకాలు. తలసీమియా మేజర్ ఉన్న పిల్లలు పుట్టిన వెంటనే ఆరోగ్యంగా కనిపిస్తారు.

Also Read: ఆస్తమా పిల్లలను భయపెట్టవద్దు

కానీ జీవితంలో మొదటి రెండు సంవత్సరాల్లోనే లక్షణాలను అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితి క్రమం తప్పకుండా రక్తమార్పిడి తప్పనిసరి కలిగిస్తుంది. మరోవైపు తలసీమియా మైనర్ గ్లోబిన్ గొలుసుల్లో ఒకటి పరివర్తనం చెందినప్పుడు సంభవిస్తుంది. ఈ పరిస్థితి ఉన్న వారు సాధారణంగా చాలా తేలిక పాటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి చికిత్స అవసరం ఉండదు . కానీ తమ ద్వారా తమ పిల్లలకు తలసీమియా సంక్రమింప చేస్తారు.తలసీమియా ఎర్రరక్త కణాల ఆల్ఫా, బీటా చైన్లను ప్రభావితం చేస్తుంది. ఆల్ఫా లేదా బీటా తలసీమియా ఉన్న తల్లిదండ్రుల నుండి ఒకటి లేదా రెండు జన్యువులూ వారి సంతానానికి సంక్రమించాయా లేదా అనే దానిపై ఆధారపడి ఈ లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఏవీ కనిపించనటువంటి పరిస్థితి నుంచి తరచుగా రక్తమార్పిడికి అవసరం అయ్యే ప్రాణాంతకమైన రక్తహీనత కలిగించే లక్షణాల వరకూ ఉండవచ్చు. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి వైద్యులు రోగి తాలూకు ఆరోగ్య చరిత్ర, కుటుంబ చరిత్ర తెలుసుకుంటారు.

Also Read: పిల్లల్లో “ఆస్తమా”.. అవగాహనే సరైన ధీమా

శారీరక పరీక్ష నిర్వహిస్తారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేక ఎవరో ఒకరు తలసీమియా వాహకాలుగా (క్యారియర్) ఉంటే లేదా తలసీమియాతో ప్రభావితమైతే అప్పుడు రక్తపరీక్షను చేయవచ్చు. రక్తంలో అసాధారణ ఆకారంలో ఉన్న ఎర్రరక్తకణాలను మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. ఈ విధంగా అసాధారణ ఆకారంలో ఎర్రరక్తకణాలు ఉంటే అవి తలసీమియాకు సంకేతాలుగా చెప్పవచ్చు. రక్తంలో అసాధారణ హిమోగ్లోబిన్ తాలూకు రక్తాన్ని గుర్తించడానికి హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్ష చేయవచ్చు. తలసీమియా రోగి తాను బతకడం కోసం ఎర్రరక్తకణాల కోసం ప్రతి మూడు, ఐదు వారాలకు ఓసారి రక్తమార్పిడి చేయించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. దేశంలో ఈ వ్యాధి చాలా సాధారణమైంది. ఏటా దేశంలో 10,000 మంది తలసీమియాతో పుడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద తలసీమియా రాజధానిగా మనదేశం రికార్డుకెక్కింది అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉన్నా అది వాస్తవం.

Also Read: సమ్మర్‌లో కండ్లకలక సమస్య

కొన్ని దశాబ్దాల వరకు పిల్లల్లో తలసీమియా ప్రాణాంతక వ్యాధిగా పీడించేది. కానీ ఇప్పుడు వైద్య చికిత్సలో అత్యంత ఆధునిక విధానాలు రావడంతో దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణిస్తున్నారు. అనేక సమస్యల కారణంగా అందులో మరీ ముఖ్యంగా శరీరంలో ఐరన్ ధాతువు విపరీతంగా ఉండడంతో రెగ్యులర్‌గా, జీవితాంతం రక్తమార్పిడి చేయించుకోవలసి వస్తోంది. రోగులు తమ శరీరంలో ఎక్కువగా ఉన్న ఐరన్‌ను జీవితాంతం తొలగించుకుంటేనే కానీ బతకడం కష్టమవుతోంది. వైద్య ఆరోగ్యభద్రత సరిగ్గా నిర్వహిస్తే నలభై, ఏభై ఏళ్లు దాటినా బతికించడం సాధ్యమౌతుంది. అయితే అది చాలా వ్యయంతో కూడుకున్న ప్రక్రియ. నాణ్యమైన జీవితం కాకపోవడం, వయసు పెరుగుతున్న కొద్దీ ఐరన్ పేరుకుపోవడం సమస్యలుగా ఉంటున్నాయి. ఈ కారణాల వల్ల మన దేశంలో తలసీమియా రోగులు కేవలం 50 శాతం మందే 25 ఏళ్ల తరువాత బతకగలుగుతున్నారు. సామాజిక , ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉండే వారిలో ఈ తలసీమియా నివారణ చాలా కష్టమవుతోంది.

Also Read: దోమల మందు వినియోగం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎముక మజ్జ మూల కణాల మార్పిడి
తలసీమియా పిల్లలకు సరైన వైద్య చికిత్స ఎముక మజ్జ మూలకణాల మార్పిడి వల్లనే సాధ్యమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పిల్లలకు హెచ్‌ఎల్‌ఎ యాంటిజెన్ సరిపోయే పిల్లలు దొరికితేనే ఇది సాధ్యమవుతుంది. హెచ్‌ఎల్‌ఎ అంటే హ్యూమన్ లుకోసైట్ యాంటిజెన్ ( హెచ్‌ఎల్‌ఎ). హెచ్‌ఎల్‌ఎ అనేది శరీరంలో చాలా కణాల్లో కనిపించే ప్రొటీన్లు లేదా గుర్తులు. శరీరం లోని రోగ నిరోధక వ్యవస్థ ఏ కణాలకు చెందినదో గుర్తించడానికి ఈ గుర్తులు ఉపయోగమవుతాయి. ఒక వ్యక్తి కణజాల రక్తాన్ని గుర్తించడానికి ఉపయోగపడే పరీక్షనే హెచ్‌ఎల్‌ఎ టైపింగ్ అని అంటారు. ఈ ఎముక మజ్జ మార్పిడికి వైద్యులలో చాలా నైపుణ్యం ఉండాలి. అంతేకాక ఎక్కువగా ఖర్చుపెట్టవలసి వస్తుంది.

Also Read: పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు.. నివారణ మార్గాలు

ఇవన్నీ కుదిరితే 3 నుంచి 7 ఏళ్ల లోనే పిల్లల్లో వైద్య చికిత్స సమర్ధంగా అందుతుంది. పిల్లలకు 18 ఏళ్లు వచ్చినా ఈ చికిత్స వల్ల మేలు జరుగుతుంది. దీనివల్ల తలసీమియా నయమైతే మిగతా పిల్లల మాదిరిగా తలసీమియా పిల్లలు మనుగడ సాగించ గలుగుతారు. ఇవన్నీ ఇలా ఉండగా ఇదివరకులా తలసీమియా ప్రాణాంతకమని భయపడవలసిన పనిలేదు. ఇప్పుడు వైద్యపరంగా అత్యంత ఆధునిక పద్ధతులు అమలులోకి రావడం వల్ల తలసీమియాను నివారించే మార్గాలు సులువవుతున్నాయి. హెచ్‌ఎల్‌ఎ సరిగ్గా మ్యాచ్ కాకపోయినా, ఇతర వైరుధ్యాలు ఉన్నా సరే తలసీమియా రోగులను బాగు చేయగలుగుతున్నారు.

తలసీమియా లక్షణాలు
చెమట పట్టడం, పొడిదగ్గు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కడుపు నొప్పి, మలబద్ధకం, లేదా విరేచనాలు, కడుపు ఉబ్బడం, రెండు రోజుల కంటే ఎక్కువగా జ్వరం వచ్చినా, వాంతులు, విరేచనాలు అవుతున్నా వైద్యులను సంప్రదించాలి. తీవ్ర దశలో శక్తి లేక పోవడం, వ్యాయామం చేయడానికి అనాసక్తి, కాలేయం వాపు చెందడం, శరీరం పచ్చగా మారడం, కాళ్లకు అల్సర్స్ ఈ వ్యాధి లక్షణాలు. ఇలాంటి తల్లులు పిల్లలకు జన్మనివ్వడం చాలా రిస్కుగా పరిగణిస్తారు. తలసీమియా నాలుగో దశలో పిల్లలు పుట్టక ముందే కడుపులో చనిపోయే ప్రమాదం ఉంటుంది.

Also Read: హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్

చికిత్స విధానం
రక్తమార్పిడి, ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ డి వంటి మందులను వైద్యులు సూచించవచ్చు. ఐరన్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచించవచ్చు. ఎముక మజ్జ మార్పిడి అవసరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ప్లీహంను తొలగించే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఈ వ్యాధి మనదేశంతోపాటు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, చైనా దేశాల్లో ఎక్కువగా ఉంది. కంప్లీట్ బ్లడ్ కౌంట్, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోపోరెసిస్, ప్రీ ఎంతోసైట్ ప్రోటోపోరోపైరిసిస్, ఫెర్రిటిస్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News