Monday, December 23, 2024

టీబీ వ్యాధి సోకితే ఊపిరితిత్తులపై ప్రభావం

- Advertisement -
- Advertisement -

Effect on the lungs in case of tuberculosis

గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది
తుమ్మినప్పుడు,దగ్గినప్పుడు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది

హైదరాబాద్: టీబీని క్షయ వ్యాధిగా పిలుస్తారు. ఇది మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా, ఒ క్కోసారి మూత్రపిండాలు, వెన్నముక, మెదడు, గర్భాశయం వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేయవచ్చు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా రెనోవా ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డా. రాఘవేంద్ర రెడ్డి పలు విషయాలు వెల్లడించారు. రెండేళ్లుగా ప్రపంచ దృష్టి మొత్తం కరోనా వైరస్‌పై కేంద్రీకృతమైంది. ఇది ఈశతాబ్దపు అత్యంత ప్రాణాంతక మహమ్మారి. కరోనా రాకతో దానివల్ల సంభవించిన మరణా లు. టీటీ వ్యాధిని వెనక్కి నెట్టాయి. కరోనాకు ముందు టీబీతో ఎక్కువ మంది చనిపోయేవారు. కరోనా వచ్చిన తరువాత ఏం జరుగుతుందో తెలియక భారీ ప్రాణ నష్టం జరిగింది. దీంతో టీబీ వ్యాధి కరోనా తరువాత సెకండ్ ప్లేస్‌కు చేరింది.

ఎలా వ్యాపిస్తుందంటే

టీబీ అన్నది గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది టీబీ రోగులు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ట్యూబర్ క్యూలోసిస్ బ్యా క్టీరియా వ్యాపిస్తుంది. ఇది ఇలా కుటుంబ సభ్యులకు, తోటి వారికి, తమ సమీపంలోని వారికి, పరిసరాలలో ని వారికి వస్తుంది. ఈ వ్యాధి ఇప్పటికి మహమ్మారిలా ప్రపంచాన్ని వేధిస్తోంది. టీబీ కేసులు దేశంలో భారీగా ఉన్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగి ఉండటంతో దేశంలో టీబీ సంక్రమణ పెరుగుతోంది. దీంతో వ్యాధి నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో వ్యాధి నియంత్రణ కష్టంగా మారుతోంది. పరీక్షల సామర్థాన్ని పెంచడం, యాక్టివ్ స్క్రీనింగ్, టీబీ హాట్‌స్పాట్ ప్రాంతాలను సులువుగా గుర్తించడం కోసం వ్యూహాలను అమలు చేయడం, చికిత్స కోసం ఔషధ సరఫరాలను పెంచడం, జనాభాను నియంత్రించడం వంటి చర్యలు పటిష్టంగా చేపడితేనే వ్యాధిని నియంత్రించవచ్చు.

వ్యాధి లక్షణాలు

విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం రావడం, చాతీలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తుండటం. రాత్రి వేళలో చెమటలు పట్టడం, చాతీలో నీరు చేరడంతో దమ్ము కూడా రావడం వంటి లక్షణాలు టీబీ వ్యాధికి చెందినవే. టీబీ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపకడపోవచ్చు. రోగ నిరోధకశక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో సూక్ష్మక్రిమి సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటకి కనిపించవచ్చు. మరికొందరిలో ఏళ్ల తరబడి బాక్టీరియా ఉండిపోయి, ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. వ్యాధి సోకిన 2 నుంచి 5 సంవత్సరాలలోపు వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి.

వ్యాధి నిర్థ్దారణ

అత్యాధునిక రోగనిర్థ్దారణ విధానాలు, చికిత్స అందుబాటులోకి వచ్చినా, టీబీ ఇప్పటికి మానవాళికి వణుకు పుట్టిస్తోంది. రోగ నిర్దారణ కోసం తె మడ పరీక్ష, ఛాతి ఎక్స్‌రే, ల్యాటెంట్ టీబీ విషయంలో కొన్నిసార్లు చర్మం పరీక్ష దేహంలో టీబీ సూక్ష్మక్రిమిని నిర్ధారణ చేసే నిరాలాజికల్ పరీక్షలు, సూక్ష్మజీవుల పెరుగుదలను తెలిపే కల్చరల్ పరీక్షలతో పాటు ఖచ్చితమైన నిర్ధారణ కోసం బ్రోంకోస్కోపీ, థొరాకోస్కొపీ , సిటీ గైడెడ్ బయాప్సీ అనే పరీక్షలు చేస్తారు.

చికిత్స

టీబీ పూర్తిగా నయం కావడానికి క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. కొన్ని రోజులు మందులు వాడగానే లక్షణాలు తగ్గడంతో వాటిని ఆపేస్తుంటారు.
వారిలో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. ఇలాంటి వారికి ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని కనీసం 6 నెలల పాటు వా డాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో 18నుంచి 24 నెలల పాటు చికిత్స పొడిగించాల్సిన రావచ్చు. ఇవి ఒకింత ప్రమాదకరమైనవి కావడంతో సైడ్‌ఎఫెక్ట్ రాకుండా ఉండేందుకు మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త పడటం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News