Monday, December 23, 2024

తృతీయ ప్రపంచ యుద్ధం సాగుతోంది

- Advertisement -
- Advertisement -

రష్యన్ మిత్రుల ప్రత్యక్ష పాత్ర ఇందుకు సూచిక
ఉక్రెయిన్ ఆర్మీ మాజీ చీఫ్ జలుఝ్ని

కీవ్ : తృతీయ ప్రపంచ యుద్ధం సాగుతోందనే అభిప్రాయాన్ని ఉక్రెయిన్ మాజీ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ వలెరీ జలుఝ్ని వ్యక్తం చేశారు. ఈ వివాదంలో రష్యన్ మిత్ర పక్షాల ప్రత్యక్ష పాత్ర దీనినే సూచిస్తోందని ఆయన తెలిపారు. ‘2024లో మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందని మనం భావించవచ్చు’ అని జలుఝ్ని ఉక్రెయిన్‌స్కా ప్రావ్దా యుపి100 అవార్డు ఉత్సవంలో ప్రసంగిస్తూ చెప్పారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉక్రెయిన్ రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘ఉత్తర కొరియా నుంచి సైనికులు ఉక్రెయిన్ ముందు నిలబడ్డారు. మనం నిజాయతీగా ఉండాలి. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఇరానియన్ ‘షహేదీలు’ నిస్గిగ్గుగా బాహాటంగా పౌరులను హతమారుస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా జవాన్లు, చైనా ఆయుధాలు ప్రస్తుతం ఈ యుద్ధానికి మరింత దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ మిత్ర దేశాలు కచ్చితమైన చర్య తీసుకోవాలని, యుద్ధం దేశ సరిహద్దులు దాటి విస్తరించకుండా నిరోధించాలని జలుఝ్ని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News