Monday, December 23, 2024

తెలుగు రాష్ట్రాల సౌజన్యంతో ప్రపంచ జల సదస్సు

- Advertisement -
- Advertisement -

హైదారబాద్: తెలుగు రాష్ట్రాల సౌజన్యంలో ప్రపంచ జల సదస్సుకు ఇంటర్నేష నల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రేనేజ్ (ఐ సిఐడి) జల రంగంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు శుక్రవారం జలసౌధ లో తెలంగాణ నీటి శాఖ ఈఎన్సీ మురళీధర్‌తో భేటి అయ్యారు. ప్రపంచ జల లక్ష్యాలపై చర్చలు జరిపారు. అనంతరం ఐసిఐడి ఉపాధ్యక్షులు డా.కె.ఎల్లారెడ్డి మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఐసిఐడి ఢిల్లీ కేంద్రంగా 1950 లో ఏర్పాటైందన్నారు. ఈ సంస్థలో 78దేశాలు భా గస్వామిగా ఉన్నాయని తెలిపారు. జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రపంచా న్ని అకలి నుంచి అభివృద్ధి వైపు పయనింప చేయ డమే లక్షంగా సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి మూడేళ్ల కొకసారి ఐసిఐడి అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ సదస్సులో అన్ని దేశాల ప్రతినిధలు పాల్గొని జల ప్రాముఖ్యతపై చర్చలు జరుపుతారని వి వరించారు. భారత్‌లో ఇప్పటివరకూ అంతర్జాతీ య సదస్సులు 1951లో తొలిసారి, 1966లో రెండోసారి జరిగాయన్నారు. నవంబర్ ఒకటి నుంచి వారం రోజుల పాటు ప్రపంచ జల సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సారి సదస్సును తెలుగు రాష్ట్రాల సౌజన్యంతో జర పారలని నిర్ణయించడం జరిగిందన్నారు. విశాఖ ను ఇందుకు వేదికగా ఎంపిక చేసినట్టు తెలిపారు. కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి జలవనరుల రంగానికి చెందిన నిపుణులు 500మంది పాల్గొననున్నారని , దేశీయంగా మరో 750మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
ఉత్తమ నీటి నిర్వహణకు అవార్డులు
విశాఖ ప్రపంచ జల సదస్సులో ఉత్తమ నీటి నిర్వహణకు సంబంధించి ప్రంపచ స్థాయి అవార్డులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 141అవార్డులు ప్రధానం చేసిందని, అందులో భారత్‌కు 14 అవార్డులు లభించాయని తెలిపారు. అవార్డులు అందుకున్న దేశాల్లో జపాన్ ప్రధమ స్థానంలో, చైనా ద్వితీయ స్థానంలో నిలవగా భారత్ మూడవ స్థానంలో నిలిచిందన్నారు. భారత్‌కు లభించిన అవార్డుల్లో తెలుగు రాష్ట్రలకే ఆరు అవార్డులు లభించాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సదర్‌మట్ బ్యారేజికి, కామారెడ్డి పెద్దవాగుకు అవార్డులు లభించినట్టు తెలిపారు. అదే విధంగా ఏపిలో కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువు, కడపకర్నూలు కాలువ,

సర్ అర్ధర్ కాటన్ బ్యారేజికి అవార్డలు లభించినట్టు తెలిపారు. విశాఖ ప్రపంచ జలసదస్సులో జలవనరులు సమర్ధవంతంగా వినియోగించుకోవటం, తక్కువ నీటితో ఎక్కవ విస్తీర్ణంలో పంటల సాగు, వాతావరణ మార్పులు తదితర అంశాలపై అంతర్జాతీయ స్ధాయిలో చర్చాగోష్టిలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జలవనరులుకు సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన ఉత్తమ సాగునీటి విధానాలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర వాటికి సంబంధించి 120స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఐసిఐడి ఉపాధ్యక్షులు డా.కె.ఎల్లారెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డితోపాటు ఈఎన్సీ మురళీధర్, గిరిధర్,సిఎం కార్యాలయ ఒఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News