- Advertisement -
బొగొటా: కొలంబియా వేదికగా జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ మీరాబాయి చాను రజత పతకాన్ని సాధించింది. బొగొటా నగరంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక 49 కిలోల విభాగంలో మీరాబాయి బరిలోకి దిగింది. ఈ క్రమంలో స్నాచ్ విభాగంలో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కిలోల బరువును ఎత్తింది. ఇక రెండు విభాగాల్లో కలిపి 200 కిలోల బరువును ఎత్తిన మీరాబాయి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
చైనాకు చెందిన జియాంగ్ జిహువా 206 కేజీల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో జపాన్ వెయిట్‌లిఫ్టర్ జిహువాకు కాంస్య పతకం లభించింది. ఇక మీరాబాయి చాను గాయంతో బాధపడుతూనే ఈ పోటీల్లో బరిలోకి దిగింది. అయినా రజత పతకం సాధించి సత్తా చాటింది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా మీరాబాయి రజతం సాధించిన విషయం తెలిసిందే.
- Advertisement -