Monday, December 23, 2024

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. ప్రీక్వార్టర్స్‌లో నీతు, మంజు, ప్రీతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. శనివారం జరిగిన పోటీల్లో భారత బాక్సర్లు నీతు గంగాస్, మంజు బంబొరియా, ప్రీతీలు విజయం సాధించారు. 48 కిలోల విభాగంలో నీతు గంగాస్ సునాయాస విజయాన్ని అందుకుంది.

కొరియా బాక్సర్ డొయాన్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నీతు అలవోకగా గెలిచి ప్రీక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 54 కిలోల విభాగంలో ప్రీతి జయకేతనం ఎగుర వేసింది. రుమేనియాకు చెందిన పెరిజోక్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ప్రీతి 43తో విజయం సాధించింది. 66 కిలోల విభాగంలో మంజు 50 తేడాతో న్యూజిలాండ్ బాక్సర్ కారా వరెరౌను చిత్తు చేసి ప్రీక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News