Friday, November 22, 2024

విభిన్న రంగాల్లో నారీశక్తి

- Advertisement -
- Advertisement -

సంపూర్ణ మహిళా సాధికారత
స్త్రీ జనోద్ధరణే లక్షంగా సంక్షేమ
పథకాలు, సమున్నత గౌరవం
ప్రభుత్వం అమలు చేస్తున్న
కార్యాచరణ దేశానికే ఆదర్శం
అంతర్జాతీయ మహిళా
దినోత్సవం సందర్భంగా సిఎం
కెసిఆర్ శుభాకాంక్షలు

సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాలి

మనతెలంగాణ/హైదరాబాద్: సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః సూక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పురుషుడితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అ పూర్వమైన విజయాలు నారీశక్తిని చాటుతున్నాయని సిఎం స్త్రీ శక్తిని చాటే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మహిళా సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ , స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలకు ప్రత్యేక సెలవును మంజూరు చేసి మహిళలను సమున్నతంగా గౌరవించుకుంటున్నామని ఆయన తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగావారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్ర వేశపెట్టిన పథకాలతో రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతుందని సిఎం తెలిపారు. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, వి ద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాల ను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని సిఎం వివరించారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం అన్నారు.

మహిళల భద్రత, రక్షణ నిమిత్తం వెంటనే చర్యలు చేపట్టేందుకు హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకకొచ్చింది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మూలధన సహాయం, వ్యూహారచన, అభివృద్ధికి వి హబ్ ద్వారా సలహా, సూచనలను అందిస్తోంది. వి హబ్ ద్వారా చేపట్టిన 21 కార్యక్రమాల ద్వారా 2194 మంది మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పింది. వి హబ్ ద్వారా రూ. 66.3 కోట్ల నిధులను అందజేయగా రాష్ట్ర వ్యాప్తంగా 2,823 మంది ఉద్యోగాలను కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News