భారతావనికి మణిహారం అనదగ్గ మహిళా మణులు ఎందరో భారత దేశంలో గౌరవింపబడ్డారు. అలా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని భారత ప్రభుత్వం తగురీతిలో ప్రోత్సహించి సత్కరించింది. రాజకీయాల్లో సైతం భారత దేశం మహిళా శక్తికి నీరాజనాలు సమర్పించింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీని ఐతే దేశం ఇప్పటికీ స్మరిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలు మొదలు దక్షిణాది వరకు రాజకీయాలను ప్రభావితం చేసిన మహిళలు “మేడం” పవర్ ను జన బాహుళ్యo ఔరా అనదగ్గ రీతిలో నే చవిచూశారు. రాజకీయాల్లో ఉన్న మహిళా శక్తి గురించి ఎందుకు ప్రధానం గా ప్రస్తావిస్తున్నానంటే..అగ్రరాజ్యం అమెరికా సైతం వీస్తూ పోయేలా “లాఫింగ్ బుద్ద” తో భారత సత్తా చాటిన ఘనత ఇండియాదే. క్రియాశీల రాజకీయాల్లోనే గాక. దేశ ప్రథమ పౌరులుగా ప్రతిభా పాటిల్ సేవలు ఇంకా మనం మరవలేదు. సుష్మా స్వరాజ్ మొదలు నేటి వరకు దేశ రాజధానికి ముఖ్య మంత్రులుగా మహిళలు పని చేసిన ఘనత దేశ రాజకీయాలదే.
ఇక ప్రజాస్వామ్యానికే ఆలయంగా అభిర్ణించదగ్గ లోక్ సభ లో “ఛైర్” ను అలంకరించిన ప్రతిభ సుమిత్ర మహాజన్ , మీరా కుమార్ లు పార్లమెంట్ కు వన్నెతెచ్చారు. ఈశాన్య భారతాన్ని మమత. దక్షిణాన జయ లలిత. ఇలా వుమెన్ ను “పవర్” ఫుల్ చేసిన ఖ్యాతి మదర్ ఇండియాదే. ఇక కళా రంగాన్ని కళాత్మకం చేసిన లతా మంగేష్కర్.. అషాభోంస్లే ల ను పద్మా లతో అలoకరించింది భారత భూమి. నటిగా..నర్తకిగా శోభన కు సలాం చేసింది పద్మం. దేశ వ్యాప్తంగా లోక్ సభ లో మహిళా సభ్యుల్ని సగౌరవంగా తమ తమ గళం వినిపించేలా శక్తి వంతం చేస్తున్నది తల్లి భారతి. భారత ఉపఖండానికి అలాంకారంగా ఉన్నట్టు భాసిల్లె శ్రీలంకకు కూడా సిరిమావో బండారు నాయకే అందించిన సేవలు ఆ ద్వీపం మరవలేదు. పొరుగు దేశం పాకిస్థాన్ సైతం బెనజీర్ భుట్టోకు పట్టం కట్టి వుమెన్ ఎంపవర్ ను చాటుకుంది.
ఇన్ని ఉదంతాలు ఇలా ఉన్నా.. అగ్రరాజ్యం, ప్రజాస్వామ్య చరిత్రలో 400 ఏళ్లు నిండిన శక్తి వంత మైన రాజ్యం అమెరికాలో మాత్రం ఇప్పటి వరకు మహిళకు అధ్యక్ష అవకాశం దక్కలేదు. అమెరికన్ ప్రెసిడెంటు అయ్యే అవకాశం ఇప్పటివరకు మహిళ కు అందని ద్రాక్షగానే ఉండిపోయింది. మహిళ మల్టీ టాస్క్ పవర్ అని చెప్పుకుంటాం. అటు ఇంటిని ఇటు బయట పని నీ చాక చక్యంగా హాండీల్ చేయడమే కాదు. పురుషుల తో సమానంగా పోటీ పడి ఆయా రంగాల్లో కాదు అన్ని రంగాల్లో మేము సైతం అని తమ ప్రతిభ చాటుకుంటున్నది భారత మహిళా శక్తి. అందుకే దేవుళ్ళను కొలిచి నట్టే దేవతలనూ ఆరాధిస్తున్నం. మహిళామణుకు వారి అద్వితీయ శక్తికి హారతి పడుతున్నాం.
మాచన రఘునందన్
9441252121
ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్
పౌర సరఫరాల శాఖ