Sunday, December 22, 2024

మహిళలే ఈ సృష్టికి మూలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పెద్దపల్లి : మార్చి 8న మహిళా దినోత్సవంను పురస్కరించుకొ ని మహిళా బంధు కేసిఆర్‌గా నామకరణం చేసి మార్చి 6,7,8 వ తేదీల లో చేయవలసిన కార్యక్రమాల గురించి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వివరించారు. మార్చి 6న ఆదివారం నాడు గ్రామ మహిళా ప్రజాప్రతినిధులు, గ్రామ మహిళా కమిటి సభ్యులు కేసిఆర్ చిత్రపటానికి రాఖీలు కట్ట డం, గ్రామ మహిళలను సమావేశ పరిచి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి వివరించడం, 7న గ్రామంలోని మహిళ లబ్ధిదారుల ఇళ్ళ కు వెళ్లి వారికి పథకాల గురించి తెలియజేసి సెల్ఫీ తీసుకోవడం కేసిఆర్ కిట్, షాదిముబారక్, కృతజ్ఞతలు కేసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారం ఏర్పాటు చేయడం, 8న గ్రామస్థాయిలో గ్రామంలోని మహిళలు అందరిని స మావేశ పరిచి ఎఎన్‌ఎం, ఆశా వర్కర్లు, స్వయం సహాయ సంఘాల నాయకురాలు, పారిశుద్ధ కార్మికులు మహిళలను సమావేశ పరిచి కేక్ కట్ చేసి ఆ తర్వాత ప్రతిభ కలిగిన మహిళలకు గౌరవ పూర్వక సన్మానం చేయడం లాం టి కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. ఇక్కడ ఎంపిపి బండారి స్రవం తి శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షులు అనంతరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దా సరి చంద్రారెడ్డి, వైస్ ఎంపిపి రాజయ్య, సర్పంచ్ జయప్రద సంజీవరెడ్డి, మా జీ సర్పంచ్ వెంకట్, మండల కోఆప్షన్ సభ్యులు హబీబ్, రెహ్మన్, ఉపసర్పంచ్ జాన్, గ్రామశాఖ అధ్యక్షులు చాంద్, నర్సింగ్, సల్లు, యూసుఫ్, కనకయ్య, ముత్యాల లక్ష్మి, మహిళ సంఘా నాయకురాలు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎం లు, మహిళా ప్రజాప్రతినిధులు సమావేశమై ముందుగా కేక్ కట్ చేసి ప్రతిభ గల మహిళలకు సన్మాన కార్యక్రమం చేశారు.
కరీంనగర్ అర్బన్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు జరుగుతున్న మహిళ దినోత్వవ వేడుకలలో భాగంగా ఆదివారం నగరంలోని కిషన్‌నగర్‌లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారిశు ధ్య మహిళ కార్మికులకు , ఆశా వర్కర్లకు ఆరిప సభ్యులకు , అంగన్వాడి టిచర్లకు సన్మానం చేసి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కంసాల శ్రీ నివాస్ మాట్లాడుతూ మహిళలే ఈ సృష్టికి మూల కారణమని వారి ఓర్పు స హనం కుటుంబ ఎదుగుదలతో వారి పాత్ర మహా గొప్పదని అన్నారు. మహిళలను గౌరవించే బాధ్యత ప్రతి పౌరుడిపై వుందని పేర్కొన్నారు.
కమాన్‌పూర్ : టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, జెడ్పీ చైర్మన్ పు ట్ట మధూకర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంతో పాటు మండలంలోని వి విధ గ్రామాలలో ఆదివారం ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చిత్ర పటానికి టిఆర్‌ఎస్ పార్టీ మహిళలు రాఖీ కట్టారు. అనంతరం స్వశక్తి సం ఘాల మహిళలకు, ఏఎన్‌ఎంలకు, మహిళా ప్రజాప్రతినధులకు, పారిశుద్ద సిబ్బందికి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్ రెడ్డి, సర్పంచులు బొల్లపల్లి శంకర్, నీలం సరిత, తాటికొండ శంకర్, పొన్నం రాజేశ్వరి, బొమ్మగాని అనిల్ గౌడ్‌లతో పాటు మహిళా నాయకురాండ్లు పాల్గొన్నారు.
సుల్తానాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలలో భాగముగా ఆదివారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో, మండలంలోని గర్రెపల్లి పరిధిలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు వీరగోని సుజాత రమేష్, పూసాల రోడ్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత రమేష్, ముఖ్యమంత్రి కేసిఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టారు. మహిళా ది నోత్సవ సంబరాలలో భాగంగా ప్రతి గ్రామంలో కేసిఆర్ ఫ్లెక్లీలకు రాఖీలు క ట్టారు. కేసిఆర్ కిట్, షాదీ ముబారక్, థ్యాంక్యూ కేసిఆర్ వంటి ఆకారం వ చ్చేలా మానవహారాలు ఏర్పాటు, థ్యాంక్యూ కేసిఆర్ ప్లెకార్డులు వంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, పార్టీ కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని గర్రెపల్లిలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు గరుడపల్లి సర్పంచ్ వీరగోని సుజాత రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. కేసిఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి మహిళా దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజి రా వు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్‌రావు, గర్రెపల్లి సింగిల్‌విండో చైర్మన్, నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్: మహిళే సృష్టికి మూలం జీవనాధారం అని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. ఆదివారం నగరంలోని మేయర్ క్యాంపు కార్యా లయం వద్ద విశిష్ట సేవలందించిన మహిళలను ఘనంగా స న్మానించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ మహిళలను గౌరవించుకోవ డం పురుషుల ప్రధాన బాధ్యత అన్నారు. మహిళ సృష్ఠికి మూలం జీ వనాధారం అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ఇంకా ముందు వరుసలో ని లువాలని పురుషులతో సమానంగా ఉంటేనే గౌరవప్రదం అన్నారు. మహిళలను గౌరవించడం మా బాధ్యత కాబట్టి నగర పాలక సంస్థ ద్వారా ప్రత్యేక ఆటల పోటీలను ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలిపారు. అంతే కా కుండ విశిష్ట సేవలు అందించిన మహిళలను కూడ సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
రామగుండం: సిఎం కెసిఆర్ మహిళల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టూ ముందుకు సాగుతున్నారని 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా బంధు కెసిఆర్ వేడుకల్లో భాగంగా 20 డివిజన్‌లో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సిఎం కెసిఆర్ చిత్ర ప టానికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమా ర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి సిఎం కెసిఆర్ అనేక పథకాలను చేపడుతున్నారన్నారు. అంతేగాకుండా వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు జి.శ్రీదేవి, ఎ.రేణుక, నీరజ, సునీత, మహిళా సమాక్య అధ్యక్షురాలు షహేదా భాను, ఆర్‌పి కె.శ్వే త, ఇ.శైలజ, ఎస్.వైశాలి, ఎం.అనూష, మంజూల, రఫీయా, ఆబేదా, ఖుతి జా, ఎస్‌కె.బాబుమియా, కె.మల్లేషం, ఇంతియాజ్, డి.శ్రీనివాస్, కె.రమేష్, కె.శ్రీనివాస్, ఎం.సదా ఉన్నారు.
జ్యోతినగర్: మహిళల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కట్టుబడి పని చేస్తున్నార ని 23వ డివిజన్ తెరాసా ఇన్‌ఛార్జి కుమ్మరి శారద అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా బంధు కెసిఆర్ వేడుకల్లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు 23వ డివిజన్ తెరాసా ఇన్‌ఛార్జి కుమ్మరి శారద ఆధ్వర్యంలో ఆర్పీలు, ఎఎన్‌ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గ్రూప్ లీడర్స్, సభ్యులకు, ఓబిలకు, మున్సిపల్ శానిటీర వర్కర్స్‌కు, కుట్టు మిషన్ కేంద్రం టైనర్స్‌కు, టిఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్లకు ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సిఎం కెసిఆర్ చిత్ర పటాలకు రాఖీలు కట్టారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తదనంత రం సన్మానాలను చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఈదునూరి శంకర్, కెవి చందు, కంది సతీష్, వీరాలాల్, అహ్మద్, ఈదునూరి లింగయ్య, గొర్రె వెంకటస్వామి, ఈదునూరి శ్రీనివాస్, కంది గాంధీ, శ్రావణ్, శివప్రసాద్, ల క్ష్మణ్, శేఖర్, ఎం. సరోజన, శాంత, దుబాసి సరోజన, మల్లికాంబ ఉన్నారు.
పాలకుర్తి: అసలు సిసలైన మహిళాబంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని జీడినగర్ ఎంపిటీసి బండారి శ్రీవాణి కిరణ్ లు పేర్కోన్నారు.మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు,మంత్రి కే తారకరామరావు ఇచ్చిన పిలుపులో బాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవం గనంగా నిర్వహించడంతో పాటు.మహిళా బంద్ కేసీఆర్ పేరట పలువురు ఆ శావర్కర్లకు,అంగన్వాడి టీచర్లకు, ఏఎన్‌ఎంలకు,గ్రామ పంచాయతీ మహి ళా సఫాయి సిబ్బందికి శాలువాలు కప్పి,చీరలను బహుకరించి ఘనంగా స న్మానించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కం కటి శ్రీనివాస్,నాయకులు దండుగుల లక్ష్మణ్,ముత్యాల కనుకయ్య,చందుపట్ల మధూకుమార్, తాటిపాముల లక్ష్మయ్య,పెరుక కృష్ణ,దేవి సందీప్,బాదే శివరాజ్,మామిడాల లక్ష్మణ్,కన్నం శ్యామ్,కన్నం శ్రీకాంత్,రెడ్డపాక రాకేష్, జంపాల రాకేష్, తదితరులు పాల్గోన్నారు.
జమ్మికుంట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహి ళా సంక్షేమమే లక్షంగా పనిచేస్తుందని మున్సిపల్ వైఎస్ చైర్‌పర్సన్ దేశినేని స్వప్నకోటి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులోని ము న్సిపల్ వైఎస్ చైర్‌పర్సన్ స్వప్న నివాసంలో మహిళ దినోత్సవం సందర్భంగా సిఎంముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు, మహిళా మున్సిపల్ కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ సిఎం కేసీఆర్ 7ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ని సబ్బండ వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. మ హిళ సం క్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజి జడ్పీటీసీ సభ్యులు అరుకాల వీరేశలిం గం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, కౌన్సిలర్ పిట్టల శ్వేతరమేష్, తెరాస నాయకులు శ్రీను, రాజబాబు, వెంకటరమణయ్య, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం : తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సిఎం కెసిఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని నేటి మహిళలు ప్రభుత్వం చూపుతు న్న చొరవతో అన్ని రంగాల్లో రాణించాలని ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్త య్య జెడ్పీటీసీ చెలకల స్వర్ణలత అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం రోజు న మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా బంధు సంబరాల్లో భాగం గా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పిలుపు మేరకు మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగుల ను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ హిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కొరకు పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి వంశీకృష్ణ, వైస్ ఎం పీపీ సుదాటి రవీందర్‌రావు, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ నూనె కుమార్, సర్పంచులు ఎర్రం శార, స్రవంతి, వేల్పూరి సంపత్‌రావు, నెత్తెటల్ల మహేందర్, మేడగోని సతీష్ గౌడ్, సిరికొండ బక్కారావు, ఎంపీటీసీ బియ్యాని శ్యామల సదానం దం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట : సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారధ్యం లో అన్నిరంగా ల్లో మహిళలు ప్రగతి సాధిస్తున్నారని ఎంపిపి పిల్లి రేణుక అన్నారు. ముందున్నెడు లేని విధంగా పెద్ద పీట వేసి ఆదరిస్తున్న ఏకైక ముఖ్యంత్రి కేసిఅర్ అని కొనియాడారు. ఆదివారం మండలల కేంద్రంలో మళాహి దినోత్సవం సందర్భంగా స్వశక్తి మహిళలు బతుకమ్మలు ఎత్తుకొని చేపట్టి న ర్యాలీలో పాల్గోన్నారు. బస్టాండ్ నుండి 400 వందల మంది స్వశక్తి మహిళలు మహిళా ప్ర తినిధలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ , ఆడుతూ పాడుతూ ర్యాలీనిర్వహించారు. పాత బస్టాండ్‌లో ఆడి పాడుతూ జై కేసిఅర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎంపిపి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాల్గోన్నారు .ముఖ్య మంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. స మావేశంలో రేణుక కిషన్ మాట్లాడుతూ ఆడ పడుచులకు కళ్యాణ లక్ష్మి , షాదీముబారక్ ద్వార రూ. లక్షా 16 వేల రూపాయలిచ్చి కేసిఆర్ మేన మా మ పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.స్వశక్తి మహిళకు పావలా వడ్డి రుణాలిచ్చి ప్రగతి పధంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఎక్కడ లేని విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ బట్టలు పంపిణీ చేసి పండుగల ప్రాశస్యాన్ని తెలియ చేస్తున్నారని వివరించారు. వితంతు, బీడి పెన్షన్లు, ఒంటరి మహిళలకు పె న్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వా ఆస్పత్రులలో సాధారణ ప్రసవాలు చేయించి 12 వేల రూపాయలతో పాటు కేసిఅర్ కిట్లు అంద చేస్తున్నట్లు తెలిపారు.గర్భవతుల కు పౌష్టికాఆహరం పంపిణీ చేసి ప్రతి నెల వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఆడ పిల్లలకు ప్రత్యేక మౌళిక వసతులు ఏర్పాటు చేసి విద్యా బోధన చేస్తున్నట్లు తెలిపారు. తరచు వారికి రక్త హీనత పరీక్షలు నిర్శహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాల పురస్కరించుకొని 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మునిగే అమృత , మాలోతు సునిత , అజ్మీర మంజుల , అజ్మీర రజిత , తెడ్డు అమృత , పాశం సరోజన, కదిర రజిత , నిమ్మ లక్ష్మి , కోల అంజవ్వ , ఎంపిటిసిలు పందిర్ల నాగ రాణి , ఎలుగందుల అనసూయ, ఇల్లందుల గీతాంజలి, అప్రా సుల్తా నా , కొత్త పల్లి పద్మ , మండల తెరాస అధ్యక్షురాలు మహ్మద్ అప్సర ఉన్నీసా , స్వశక్తి సంఘాల సిఏలు, జడ్పీటిసి లక్ష్మన్ రావు ఏఎంసి చేర్మేన్ కొండ ర మేశ్ గౌడ్ , వైస్ ఎంపిపి కదిర భాస్కర్ గౌడ్, మంండల తెరాస అధ్యక్షులు క్రిష్ణహరి, యూత్ అధ్య క్షులు ఎడ్ల లక్ష్మన్, పట్టణ అధ్యక్షులు బండారి బా ల్ రెడ్డి , పలువురు కార్యకర్తలు, నాయకలు పాల్గోన్నారు.

గంభీరావుపేట : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరికి హెల్త్ ప్రొపైల్ తయారు చేసే ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమని న్యాప్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గంభీరావుపేటలో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా కొండూరి రవీందర్‌రావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఎన్నొ అభివృద్ది కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా మండలంలోని పది మహిళా సంఘాలకు రూ. 80.00లక్షల చెక్కులు అందించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు బోనాలతో ర్యాలీ తీశారు. బతుకమ్మలు ఆడుతూ సంబరా ల్ని అంబరాన్నంటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కొం డూరి మాట్లాడారు. మహిళలు ప్రభుత్వం ద్వారా అందే పలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వంగ కరుణ, జడ్పీటీసీ విజయ, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పాపగా రి వెంకటస్వామిగౌడ్, ఏఎంసి చైర్మన్ సుతారి బాలవ్వ, ప్యాక్స్ చైర్మన్ భూ పతి సురేందర్, జడ్పీ కో ఆప్షన్ హైమద్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోయిన్‌పల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండల కేంద్రంలోని అం బేద్కర్ చౌరస్తాలో ఆదివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు మహిళలు పెద్ద ఎత్తు న హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ ఆట ఆడినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్ల పెళ్లి వేణుగోపాల్, జెడ్‌పిటిసి కత్తెర పాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, బోయిన్ పల్లి గ్రామ సర్పంచ్ గుంటి లత శ్రీ శంకర్, ఎంపీటీసీ సంభ బుచ్చమ్మ లక్ష్మీరాజ్యం, వెంకట్రావు పల్లి గ్రామ సర్పంచి బూరుగు నందయ్య, అనంతపల్లి ఎంపీటీసీ వనజ పురుషోత్తం రెడ్డి, వరదవెల్లి గ్రామ సర్పంచ్ లత రాజు, మండలంలోని పలు గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు, మాజీ జెడ్పిటిసి కొంకటి లచ్చిరెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్ అరు ణ, ఏపీ ఎం నరసయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వం పల్లి లక్ష్మి రా ములు, మండలంలోని అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు ఉన్నారు.
ఓదెల: సిఎం కేసీఆర్ మహిళల పెద్దన్న పాత్ర పోషిస్తూ వారి సంరక్షణకు క ల్యాణలక్ష్మీ, ఆరోగ్యానికి కేసీఆర్ కిట్, మహిళ సమాఖ్య భవనం తదితర ప థకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రధినేతకు కృతజ్ఞతలో భాగంగా మండలంలోని హ రిపురం సర్పంచ్ గుండేటి మధుయాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టారు. తెరాస పార్టీ పిలుపు మేరకు మండలంలోని పలు గ్రామాల్లో మహిళ బంధు వేడుకలు తెరాస నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండేటి మధుయాదవ్, మాజీ సర్పంచ్‌లు మారబోయిన మల్లమ్మచ కర్రె స్వరూప, వార్డు సభ్యులు గంధం పద్మ, సీఏ శ్రీలత, అంగన్వాడి టీచర్ శ్రీలత, మహిళాసంఘం అధ్యక్షురాలు నూనే పద్మ, మహిళ సంఘాల మహిళలు పాల్గొన్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో గల యూనిటి మోడల్ స్కూల్‌లో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవం మొదటిరోజు కేటిఆర్ ఆదేశాల మేరకు సిఎం కేసిఆర్ చిత్రపటానికి కటారి రేవతిరావు రాఖీ కట్టారు. ఈ సందర్భం గా కటారి రేవతిరావును పెద్దపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దాసరి మమత రెడ్డి, సీనియర్ నాయకులు ఉప్పు రాజు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆశా వర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల : తెలంగాణలో సిఎం కెసిఆర్ ప్రభుత్వం మహిళలకు సమున్నత స్థా నం కల్పిస్తున్నారని జడ్‌పి చైర్‌పర్సన్ ఎన్ అరుణ అన్నారు. అంతర్జాతీయ మ హిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ మె ఎంసిపి జిందం కళచక్రపాణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్‌పిసిపి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అ మలు పరిచి నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నారని, లక్షలాది మంది బీ డి కార్మికులకు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందించి ఆదుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంసిపి జిందం కళచక్రపాణితో కలిసి మున్సిపల్ కార్మికులను సత్కరించారు.

జగిత్యాల రూరల్: ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బిఎస్ లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో చైతన్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. మహిళల ఔన్నత్యం, ధీరత్వం గు రించి రాణి రుద్రమదేవి చరిత్రను తెలుసుకోవాలన్నారు. మహిళా బంధు కా ర్యక్రమంలో భాగంగా స్థానిక భాగ్యరాజ్ ఫంక్షన్ హాలులో జగిత్యాల రూ రల్, అర్బన్ మండలాలకు చెందిన విశిష్ట సేవలందించిన మహిళలను ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్, జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌‌‌రరకాస్ సొసైటీ సభ్యులు, కళాశాల అధ్యాపక బృందం, పి ఎసిఎస్ చైర్మన్ దామోదర్‌రావు, ఫ్యాక్స్ చైర్మన్‌లు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రా వు, రైతు బంధు సమితి మండల కన్వీనర్లు రవీందర్‌రెడ్డి, జుంబర్తి శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చె రకు జాన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News