- Advertisement -
ముంబయి: అన్ని వయస్సుల మహిళలు వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని రిలయన్స్ అధినేత నీతా అంబానీ తెలిపారు. 61 సంవత్సరాలలోనూ ఆపలేని ఉత్సాహంగా ఉంటానన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ మాట్లాడారు. ఆమె ప్రేరణాత్మకమైన ఫిట్ నెస్ ప్రయాణం గురించి తెలియజేశారు. ఆమె తన రోజువారీ జీవనశైలి అలవాట్లు, ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్పారు. 61 ఏళ్ల వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, ప్రతిరోజూ స్ట్రాంగ్ హర్ మూవ్ మెంట్ లో చేరి, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. శారీరక శ్రమతో దృఢంగా మారి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
- Advertisement -