ఎడిన్ బర్గ్: స్కాట్లాండ్‌లోని కాల్విన్ సమీపంలో 1990 ఆగస్టులో ఇద్దరు హైకర్లు ఆకాశంలో ఓ వింత ఎగిరే వస్తువును ఫోటో తీశారు. అయితే ఛాయాచిత్రం(ఫోటో) దశాబ్దాలుగా కనిపించకుండా పోయింది, దాంతో చాలా ఊహాగానాలు, అనేక కుట్ర సిద్ధాంతాలకు తావయింది. ఇప్పుడు ఆ ఫోటో మొదటిసారి కనుగొనబడింది, ప్రజలకు బహిర్గతం చేయబడింది అని ‘న్యూస్‌వీక్’ పేర్కొంది. చిత్రంలో ఒక విచిత్రమైన, డైమండ్ ఆకారంలో ఉన్న లోహ వస్తువు ఆకాశంలో తిరుగుతూ, దాని వెనుక ఒక ఫైటర్ జెట్ ఎగురుతున్నట్లు చూపబడింది. చిత్రాన్ని తీసిన హైకర్‌ల కథనం ప్రకారం, తెలియని ఎగిరే వింత వస్తువు(UFO) సుమారు 10 నిమిషాల పాటు ఆకాశంలో తిరుగుతుండగా తక్కువ హమ్‌ను విడుదల చేసింది.
“కాల్విన్ ఫోటో”గా పిలవబడే ఆ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్‌లు అనామకంగా మిగిలిపోయారు. అయితే బ్రిటీష్ జర్నలిస్ట్ డేవిడ్ క్లార్క్ యొక్క 13 సంవత్సరాల అన్వేషణ కారణంగా ఈ ఫోటో మళ్లీ ఇప్పుడు కనుగొనబడింది.
‘ది ఇండిపెండెంట్’ ప్రకారం, హైకర్లు UFO యొక్క ఆరు ఛాయాచిత్రాలను తీసి వాటిని స్కాట్లాండ్ యొక్క ‘డైలీ రికార్డ్’ వార్తాపత్రికతో పంచుకున్నారు. వార్తాపత్రిక వాటిని తమ దేశ రక్షణ మంత్రిత్వ శాఖతో పంచుకుంది, అయితే అస్పష్టంగా ఉన్న కారణాల వల్ల, ఛాయాచిత్రాలు ప్రజల దృష్టి నుండి అదృశ్యమయ్యాయి. ప్రస్తుతం షెఫీల్డ్ హాలమ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న క్లార్క్, నాటి ఫోటోలలో ఒకటి రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) మాజీ ప్రెస్ ఆఫీసర్ క్రెయిగ్ లిండ్సే వద్ద ఉన్నట్లు గుర్తించడంతో అవి 32 సంవత్సరాల తర్వాత ఇటీవల ప్రచురించబడ్డాయి. అంత వరకు అవి కనిపించకుండా పోయాయనే చెప్పాలి.
Calvine UFO image has settled the debate as to whether a good quality image would be enough to sway the hardened sceptics. The answer is no, they're still refusing to accept what's in front of them and are instead suggesting it's a pond / lake. pic.twitter.com/1qYomJMvUb
— Project Unity (@TheProjectUnity) August 16, 2022