Tuesday, January 21, 2025

2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా దుబాయ్ ఎయిర్‌పోర్టు

- Advertisement -
- Advertisement -

అబు దాబి: ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్న దుబాయ్‌లోని అల్ మఖ్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2050 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా రూపొందనున్నది. ఏడాదికి 25.5 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా అ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

దుబాయ్ సౌత్‌లో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న విస్తరణ పనులు బహుళ సాధక రవాణా కేంద్రంగా తీర్చిదిద్దనున్నాయి. ఇక్కడి నుంచి రోడ్డు, విమాన, సముద్ర మార్గ రవాణాకు వీలుగా సౌకర్యాలు ఏర్పడనున్నాయి. ఈ మేరకు దుబాయ్ సౌత్ ట్వీట్ చేసింది. బిజినెస్ ఫ్రెండ్లీ ఫ్రీ జోన్‌గా ఆవిర్భవించనున్న ఈ విమానాశ్రయ సముదాయం నివాసయోగ్యం కూడా కాగలదని పేర్కొంది.

దుబాయ్ వరల్డ్ సెంట్రల్(డిడబ్లుసి)గా కూడా పిలిచే అల్ మఖ్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే రెండవ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం. 2010 జూన్ 27న కార్గో కార్యకలాపాల కోసం ప్రారంభమైన ఈ విమానాశ్రయంలో 2013 అక్టోబర్‌లో ప్రయాణికుల రవాణాకు సంబంధించిన విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఏడాదికి 57 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News