Saturday, November 16, 2024

ప్రపంచం లోనే అతిపెద్ద హుబ్బళ్లి రైల్వేప్లాట్‌ఫాం… ప్రధాని మోడీ జాతికి అంకితం

- Advertisement -
- Advertisement -

ధార్వాడ్ : కర్టాటక లోని హుబ్బళ్లి లోని శ్రీ సిద్ధారుదలో ప్రపంచం లోనే అతి పెద్ద 1.5 కిమీ ( 1,507 మీటర్ల ) పొడవున్న రైల్వే ప్లాట్‌ఫాంకు ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్లాట్‌ఫాంను జాతికి అంకితం చేశారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా దీన్ని గుర్తించింది. రూ. 20 కోట్లతో దీన్ని నిర్మించారు. హోస్పేట్ హుబ్బళ్లి టినైఘాట్ సెక్షన్ విద్యుద్దీకరణను కూడా జాతికి అంకితం చేశారు. దీనికి హోస్పేట్ స్టేషన్‌ను విద్యుత్ మార్గం అనుసంధానంతో అభివృద్ధి చేశారు. దీనికి రూ. 530 కోట్లు ఖర్చుచేయడమైంది. ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పించే ఈ రీజియన్‌ను హంపీ స్వారక చిహ్నాల నమూనాతో స్టేషన్‌ను రూపొందించారు.

హుబ్బళ్లి ధార్వాడ్ స్మార్ట్ సిటీ కి సంబంధించి అనే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.520 కోట్లు. ఈ రీజియన్ ప్రజల వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రూ.250 కోట్లతో నిర్మించనున్న జయదేవ ఆస్పత్రి, రీసెర్చిసెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రజల గుండె జబ్బులకు సంబంధించి కార్డియక్ కేర్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. రూ. 1040 కోట్లతో ఏర్పాటయ్యే దార్వాడ్ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్‌కు శంకుస్థాపన చేశారు. రూ. 150 కోట్లతో ఏర్పాటు కానున్న తుప్పరిహల్లా ఫ్లడ్ డామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వరదల ముప్పును నివారించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు అంచున గోడలు, గట్లు నిర్మిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News