Thursday, January 23, 2025

ప్రపంచ అత్యంత వృద్ధుడి జీవిత రహస్యం?

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్: ప్రపంచంలో జీవిస్తున్న అత్యంత ఏళ్ల వ్యక్తిని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచానికి పరిచయం చేసింది. యూట్యూబ్ ద్వారా వీడియో క్లిప్ ను షేర్ చేసింది. జాన్ అల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ జీవించి అత్యంత వృద్ధుడని పేర్కొంది. ఆయన వయస్సు 111 ఏళ్లని తెలిపింది.

తాను అన్నేళ్లుగా జీవించి ఉన్న కారణాన్ని టిన్నిస్ వుడ్ బయటపెట్టాడు. ‘అదంతా అదృష్టం కొద్దే…ఎవరైనా సరే ఎక్కువ కాలం జీవించొచ్చు లేక తక్కువ కాలం జీవించొచ్చు. దాన్ని ఎవరూ మార్చలేరు’అని చెప్పకొచ్చారు.

‘‘మీరు ఎక్కువగా త్రాగినా, తిన్నా, నడిచినా, ఒకవేళ ఏది ఎక్కువ చేసినా తప్పక మీరు బాధకు గురవుతారు’ అని ఆయన అన్నారు. తన జీవితంలో చూసిన మార్పులను ఆయన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

తన జీవితమంతా ప్రపంచం మారుతుండడం చూశానని ఆయన చెప్పిన విషయాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తన బ్లాగ్ లో తెలిపింది. ప్రపంచం ఎల్లపుడూ మారుతోన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రపంచం మెరుగుపడుతోందని, కానీ అంతగా మాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

టిన్నిస్ వుడ్ 1942లో  తన భార్య బ్లాడ్ వెన్ ను వివాహమాడారు. వారిరువురు 44 ఏళ్ల దాంపత్య జీవితం గడిపారు. తర్వాత ఆయన భార్య మరణించింది. ఆయనకో కూతురు, నలుగురు మనుమలు, ముగ్గురు మునిమనుమలు ఉన్నారు.

ఆయన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు నిన్ననే (5 ఏప్రిల్ 2024) యూట్యూబ్ లో షేర్ చేసింది. అది పోస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 43000 మంది చూశారు. అనేక మంది కామెంట్స్ కూడా పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News