Monday, December 23, 2024

దీక్షా దివస్‌ను అన్ని దేశాల ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించుకోవాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్‌ను అన్ని దేశాల ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించుకోవాలని బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేశ్‌బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కెసిఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందేనని, ఆ రోజు కెసిఆర్ చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని, తెలంగాణ ఉద్యమ గతిని మార్చేసిందని, ఆరోజు తెలంగాణ సమాజం యావత్తు కెసిఆర్ వెంట నిలవడంతో పాటు కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా దీక్షా దివస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు ప్రపంచ దేశాల్లో దీక్ష దివస్‌ను జరుపుకోవాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు. అలాగే దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ అమరులకు అలాగే తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులు అర్పించాలని ఆయన కోరారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News