- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో భాగంగా పాఠశాలలకు పింపిణీ చేసే బియ్యంలో నాణ్యతలోపించడంతో పాటు పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. శనివారం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థికి పురుగు కనిపించిది. విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఇకనైనా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
- Advertisement -