Thursday, January 23, 2025

అధ్వాన్నంగా ఆర్‌అండ్‌బి రోడ్డు

- Advertisement -
- Advertisement -
  • రోడ్డుపై ప్రయాణం నరకయాత
  • రోడ్డుపై తరచూ ప్రమాదాలు
  • వర్షాకాలం పట్టపగలే చుక్కలు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
  • మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు

కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రం నుండి పేరుపల్లి ద్వారా మాదారం వైపు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్ చాలాచోట్ల గుంతలు పడి, అధ్వానంగా తయారై, ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. పేరుపల్లి వైపు వెళ్లే రైల్వే గేటుకు ఇవతల వైపు, అవతల వైపు రోడ్డు రెండు మూడు అడుగుల లోతు గుంతలు పడి, ఆ రోడ్డుపై ప్రయాణం నరకయాతన గా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రోడ్డు ద్వారా తులిసా తండా, రావోజీ తండా, పేరుపల్లి, గుంపెల్ల గూడెం, కొత్తతండా, మాదారం, మంగలి తండా తదితర గ్రామాల ప్రజలు అనునిత్యం వందల సంఖ్యలో తమ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు.

ఎప్పుడో వేసిన రోడ్డు కావడంతో అప్పుడప్పుడు వర్షాలు రావడంతో తారు ఊడిపోయి, కంకర తేలి, గుంతలు ఏర్పడ్డాయని, ఒక్కో చోట పూర్తిగా డాంబరు లేచిపోయి, గుంతలు ఏర్పడ్డాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఎండాకాలం ఈ రోడ్డుమీద ఎలాగోలా ప్రయాణిస్తున్నా, ఇక వర్షాకాలం వస్తే రోడ్డుమీద గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో, ఎక్కడ మంచిగా ఉందో, ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనాలు ఆ గుంతలలో పడుతూ, ప్రమాదాలకు గురవుతున్నామని పలువురు ప్రయాణికులు ఆవేదనగా తెలిపారు.

ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరిగాయని, ఈ రోడ్డును మరమ్మతు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ రోడ్డుపై ఉన్నతాధికారులు ఇకనైనా దృష్టి సారించి, రోడ్డును మరమ్మతులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News