Friday, December 20, 2024

అయోధ్యలో వెంకయ్య దంపతుల పూజలు

- Advertisement -
- Advertisement -

Worship of Venkaiah couple in Ayodhya

అయోధ్య : ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారంఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు సతీసమేతంగా చేరుకున్నారు. తొలుత రామజన్మభూమి స్థలి వద్దకు చేరుకున్నారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజాదికాలు నిర్వహించారు. ప్రత్యేక రైలులో ఉప రాష్ట్రపతి దంపతులు లక్నో నుంచి అయోధ్యకు వచ్చారు. వారికి గవర్నర్ ఆనందిబెన్ పటేల్ , ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇతరులు సాదర స్వాగతం పలికారు. ఫైజాబాద్ ఎంపి లల్లూ సింగ్, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా వీరిలో ఉన్నారు. దేవాలయ ట్రస్టు భూమి ఆవరణలో వారిని పూజారులు తోడ్కోని వెళ్లారు. రామాలయ నిర్మాణ సంబంధిత పూర్తి వివరాలను ఉప రాష్ట్రపతికి అక్కడి అధికారులు తెలిపారు. ప్రతిపాదిత రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ధ్వజాస్తంభానికి వెంకయ్యనాయుడు భక్తితో నమస్కరించారు. . గర్భగుడిలో శ్రీరాముడి ఎదుట మోకరిల్లడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సవినయంగా తెలియచేసుకున్నారు. ఆయన ఆ తరువాత ప్రఖ్యాత హనుమాన్‌గార్హి దేవాలయం కూడా సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News