Friday, December 27, 2024

చిత్తు.. చిత్తు

- Advertisement -
- Advertisement -

నాలుగు పార్టీలకు ఘోర పరాజయం
అడ్రస్‌లేని జనసేన, బిఎస్‌పి, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ నాలుగు పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయి. కనీసం పోటీ చేసిన స్థానాల్లో గౌరవప్రదమైన ఒట్లను కూడా తెచ్చుకోలేకపోయాయి. బహుజనసమాజ్‌పార్టీతోపాటు సిపిఎం, జనసేన ,పార్వర్డ్‌బ్లాక్ పార్టీలకు ఈ ఎన్నికల్లో ఓటర్లు దిమ్మెదిరిగేలా షాక్ ఇచ్చారు. ఇప్పట్లో కోలుకోలేనంతగా పరాజయం బాట పట్టించారు. సిపిఐ పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టి ఒటమి నుంచి తృటిలో తప్పించుకుని బయటపడింది. బిఎస్‌పి పార్టీ రాష్ట్రంలో 111 నియోజకవర్గాల్లో అభ్యర్దులను నిలబెట్టి ఒక్కచోట కూడా గెలిపించుకోలేపోయింది. ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్‌లో పోటీ చేశారు. అక్కడ బిజేపి అభ్యర్దిగా పోటీ చేసిన పాల్వాయి హరీష్‌బాబు చేతిలో ఘోరమైన పరాజయం చవిచూశారు.

సిపిఎం పార్టీ 17స్థానాల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి చేతిలో పరాభవం చవిచూశారు.అంతే కాకుండా ఆ పార్టీ మరో సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి కూడా మిర్యాలగూడలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లకా్ష్మరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.ఫార్వర్డ్ వర్డ్ బ్లాక్ పా ర్టీకూడా ఓటమిని చవిచూసింది. ఆ పార్టీ నుంచి కొత్తగూడం నియోజకవర్గంలో పోటీ చేసిన జలగం వెంకట్రావ్ సిపిఎం అభ్యర్ధి కూనంనేని సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.జనసేన పార్టీ కూడా ఘోరమైన పరాజాయాన్ని మూటగట్టుకుంది.ఈ పార్టీ బిజేపితో పొత్తులో ఎనిమిది నియోజకవర్గాలనుంచి పోటీ చేసికనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేపోయిం ది. జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పార్టీ అభ్యర్దులకోసం ఎ న్నికల ప్రచారం చేసినప్పటికీ అభ్యర్ధులందరూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News