Sunday, December 22, 2024

రోహిత్ ఖాతాలో చెత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

సెంచరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఐదు పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ రూపంలో వెనుదిరగడంతో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రెండో టీమిండియా కెప్టెన్‌గా తన చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2010లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోనీ డకౌట్‌గా మైదానం వీడాడు. భారత్ నుంచి ధోనీ మొదటి కెప్టెన్‌కాగా రోహిత్ రెండో కెప్టెన్‌గా చెత్త రికార్డు సృష్టించారు. టెస్టులో ఇప్పటి వరకు రోహిత్‌ను రబాడ 14 సార్లు ఔట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News