Monday, March 10, 2025

నేను మోదీ రాజకీయవారసుడిని కాను: యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

తాను ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ వారసుడి గా కన్నా.. ప్రజాసేవకే అంకితం అవుతానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. తాను ఎవరికీ వారసుడిని కానని ఆయన అన్నారు. ఢిల్లీ కి ఉన్నతపదవికి వెళ్లే కన్నా.. గోరఖ్ పూర్ కు వెళ్లేందుకే తాను ఇష్టపడతానని యోగి వివరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే ఇష్టపడతానని, ప్రజలకు సేవచేయడమే తన కర్తవ్యంగా భావిస్తానని యోగి అన్నారు..ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.బీజేపీలో మీ రాజకీయ భవిష్యత్ ఏమిటన్న ప్రశ్నకు.. నేను ఎవరికీ వారసుడిని కాను. నేను యోగిని. భరతమాత సేవకుడిని. ఉత్తరప్రదేశ్ ప్రజలకు సేవ చేసే బాధ్యతలు నాకు అప్పగించారు.

శక్తి వంచన లేకుండా నేను నా విధులను నిర్వహిస్తున్నానని యోగి స్పష్టంగా సమాధానం ఇచ్చారు. తనకు పార్టీ అవకాశం ఇస్తే.. తాను ఢిల్లీ కన్నా..గోరఖ్ పూర్ మఠానికి వెళ్లిపోతానని ఆదిత్యనాథ్ అన్నారు. గోరఖ్ పూర్ కు తిరిగి వెళ్లిపోయేందుకే తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. అదే మరో సారి స్పష్టం చేస్తున్నానని యోగి వివరించారు. మహా కుంభమేళాలో జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని, తెలిపారు. తమ ప్రభుత్వం మరణాల సంఖ్యను దాచి పెడుతోందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని యోగీ ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికలు 80-20 కాగలవని అన్నారు. .అంటే బీజేపీ 80 శాతం సీట్లు మిగతావారు 20 శాతం పొందగలరని పరోక్షంగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News