Wednesday, January 22, 2025

వామ్మో.. ఇంత అవినీతా.. మోడీజీ!!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, బిజెపి అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలు గు చూస్తున్నాయి. ఆ పార్టీ నేతల మధ్య అనైతికత, ఇత్యాది అంశాలతో రాష్ట్రంలో బిజెపి ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందోనన్న విషయం తేట తెల్లమైంది. ఇదే సందర్భంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు చేసిందని తెలంగాణ బిజెపి ఎంఎల్‌ఎ చేసిన వాదనను కేంద్ర ఏజెన్సీలు ఎందుకు విచారించడం లేదని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రశ్నిం చారు.

“తెలంగాణ బిజెపి ఎంఎల్‌ఎ తన పార్టీ ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని బహిరంగంగా చెబుతున్న ప్పుడు ఇసి, ఇడి, ఐటి ఎక్కడ ఉన్నా యి? బిజెపిపై ఏమైనా నోటీసులు జారీ చేస్తారా? లేదా విచారణ చేస్తారా?” అని కెటిఆర్ ఘాటుగా ప్రశ్నిం చారు. అవినీతి గురించి మోడీ మాట్లాడిన మాటలు విని కోటి మంది చనిపోయారంటూ మంత్రి కెటిఆర్ వ్యంగ్యోక్తులు విసిరారు. తెలంగాణలో ఒక్క ఉపఎన్నిక కు బిజెపి రూ.100 కోట్లు ఖర్చు చేసిందని, ఆ పార్టీ ఎంఎల్‌ఎ షాకింగ్ ఆడియో లీక్ చేశారని, ఒక్క నియోజక వర్గానికి రూ.100 కోట్లు కేటా యిస్తే, బిజెపి ఏ స్థాయిలో అవి నీతి జరిగిందో ఊహించుకోవచ్చంటూ ఎంబిఎ గ్రాడ్యూయేట్ నాయిని అనురాగ్‌రెడ్డి ట్వీట్‌కు కెటిఆర్ ప్రతిస్పందించారు.
గత వారంలో…
గతేడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి రూ.100 కోట్లు ఖర్చు చేసిందని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు పేర్కొన్న సంగతి విదితమే. గత వారం అప్పటి రాష్ట్ర బిజెపిఅధ్యక్షుడు బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ఈ వాదనను వినిపించారు. బండి సంజయ్ ఆదా యవనరులపై విచారణ జరిపించాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. రఘునందన్‌రావు వాంగ్మూలంపై విచారణ జరిపించాలని కోరుతూ కరీంనగర్‌లో ఉన్న కొందరు స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News